కొత్త సినిమా మొదలైంది
Mbmtelugunews//సినిమా,ఆగష్టు 16 ప్రతినిధి మాతంగి సురేష్:విశ్వక్సేన్ కొత్త సినిమా మొదలైంది.’వీఎస్13′ వర్కింగ్ టైటిల్ తో మొదలైన ఈ
చిత్రానికి దర్శకుడు శ్రీధర్ గంట,సుధాకర్ చెరుకూరి నిర్మాత. గురువారం ఈ చిత్రం షూటింగ్ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి ‘విశ్వంభర’ దర్శకుడు వశిష్ట క్లాప్ ఇవ్వగా, శ్రీకాంత్ ఓదెల కెమెరా స్విచాన్ చేశారు.నిర్మాతలు నాగవంశీ,సాహు గారపాటి,స్క్రిప్ట్ ని మేకర్ కి అందించారు.ఈ చిత్రంలో విశ్వక్సేన్ ఫెరోషియస్ పోలీస్ గా
కనిపించనున్నారు.ఇటీవల ఈ లుక్ లో పోస్టర్ని కూడా మేకర్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే.విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ యూనిక్ పొలిటికల్ యాక్షన్ డ్రామా రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల నుంచి మొదలవుతుందని,’ఎవ్రీ యాక్షన్ ఫైర్స్ ఏ రియాక్షన్’ అనే ట్యాగ్ ను
తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కన్నడ నటి సంపద కథానాయికగా నటిస్తున్నది.ఈ చిత్రానికి కెమెరా:
‘తంగలాన్’ ఫేం కిశోర్ కుమార్,సంగీతం:అజనీష్ లోక్ నాథ్,నిర్మాణం:ఎస్ఎల్వీ సినిమాస్.