కొదాడలో రోడ్డు భద్రతపై బైక్ ర్యాలీ
:ఎంవీఐ జిలానీ షేక్ పచ్చజెండా ఊపి ప్రారంభం.
Mbmtelugunews//కొదాడ, జనవరి 17(ప్రతినిధి మాతంగి సురేష్): పట్టణంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ జిలానీ షేక్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనం నడుపుతూ మొబైల్ ఫోన్ వినియోగం చేయరాదని సూచించారు. చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణాంతక ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనం నడపడం, అధిక వేగంతో ప్రయాణించడం వంటి అలవాట్లు ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయని తెలిపారు.
ఈ బైక్ ర్యాలీ కొదాడ పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా సాగి ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించింది. ర్యాలీలో పాల్గొన్న ద్విచక్ర వాహనదారులు డ్రైవింగ్‌లో సెల్‌ఫోన్ వినియోగం వద్దు, హెల్మెట్‌తోనే భద్రత వంటి నినాదాలతో ప్రజలను చైతన్యపరిచారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ జిఆర్ చరణ్ పాల్గొన్నారు.రవాణా శాఖ సిబ్బంది, స్థానిక యువత పెద్ద సంఖ్యలో ఈ బైక్ ర్యాలీలో భాగమయ్యారు.
ఇటువంటి అవగాహన కార్యక్రమాల ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చని, ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉందని అధికారులు తెలిపారు.



