బాయ్ బయ్ బొజ్జ గణపయ్య
:అంగరంగ వైభవంగా నిమజ్జన ఊరేగింపు.
:చిన్న పెద్ద ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ నిమగ్నంలో పాల్గొన్నారు.
:భక్తిశ్రద్ధలతో నిమజ్జనాన్ని జరుపుకున్నాం:భవాని నగర్ బాయ్స్ ఉత్సవ కమిటీ.
Mbmtelugunews//కోదాడ,సెప్టెంబర్ 16(ప్రతినిధి మాతంగి సురేష్):గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు పూజలతో ప్రసాదాలతో ఘనంగా జరుపుకున్నామని భవాని నగర్ బాయ్స్ ఉత్సవ కమిటీ వారు తెలిపారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మూడియాల భారత రెడ్డి వీధిలో భవాని నగర్ బాయ్స్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను గత తొమ్మిది రోజులు ఘనంగా జరుపుకున్నామని తెలిపారు.అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించామని అన్నదాన కార్యక్రమానికి దాత కృష్ణారెడ్డి సహకరించడం మాకెంతో సంతోషంగా ఉందని తెలిపారు.మా ఉత్సవ కమిటీకి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.అనంతరం పట్టణ వీధులలో గణేష్ శోభాయాత్ర ఘనంగా నిర్వహించామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు,మహిళలు,పెద్దలు,పిల్లలు తదితరులు పాల్గొన్నారు.