కోట్ల తెలంగాణా వాదుల కల నెరవేర్చి మహనీయుడు జయశంకర్ సార్:డా,, పి పెంటయ్య
కోదాడ,ఆగష్ట06(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:పట్టణంలో ప్రాంతీయ పశువైద్యశాలలో తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించినారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అసిస్టెంట్ డైరెక్టర్ డా పి పెంటయ్య పాల్గొని అండ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ భవిష్యత్ తరాలకోసం తెలంగాణ సాధనకు రూపకల్పన చేసి కోట్ల తెలంగాణా వాదుల కల నెరవేర్చి ఆర్జించిన తెలంగాణలో మనందరం తెలంగాణ జాతి నిర్మాత అశయసాధనకోసం వృత్తిధర్మం పాటించి రాష్ట్రపురోగతికి పాల్పడాలని సిబ్బందికి సూచించారు.వేడుకల్లో మునగాల,ఆకుపాముల పశువైద్యాధికారులు డా,, మమత,డా,, హరిత,పశువైద్య సిబ్బంది,విద్యుత్ శాఖ లైన్ మెన్,సిబ్బంది శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.