కోదాడ,డిసెంబర్ 21(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:కోదాడ నియోజకవర్గ ముస్లిం మైనారిటీ ఉద్యోగస్తులకు,పెద్దలకు,పట్టభద్రులకు, శ్రేయోభిలాషులకు నమస్కారములతో బుధవారం రాత్రి స్థానిక కౌసర్ నగర్ లోని మెగా కార్యాలయంలో ముస్లిం మైనారిటీ ఎంప్లాయిస్ అండ్ గైడర్స్ అసోసియేషన్(ఎంఎంఈజిఏ- మెగా) లోగోను పునఃస్థాపించుకొనడం జరిగింది.ఈ సందర్భంగా మెగా సభ్యులు మాట్లాడుతూ నిరుద్యోగ యువతీ,యువకులకు విద్యా,ఉపాధి అవకాశాలలో చేయూతనందించుటకు,ముస్లిం మైనారిటీలలో సాధికారతను పెంచుటకు ఒక (వ్యవస్థ) ఆర్గనైజేషన్ అనివార్యం అయినందున ఈ మెగాను స్థాపించడం జరిగిందని అన్నారు.ఈ మెగా(ఎంఎంఈజిఏ)ఆర్గనైజేషన్ ద్వారా కొన్ని సేవ కార్యక్రమాలు నిర్వహిద్దామని తలపెట్టిన ఈ కార్యక్రమంలో మీ యొక్క భాగస్వామ్యం,తోడ్పాటు ఎంతో అవసరం గతంలో లాగే మీ అందరి యొక్క ఆదరాభిమానాలతో మెగా(ఎంఎంఈజిఏ)కొనసాగుతుందని నేటి నుంచి మనుగడలోకి వస్తుందని తెలియజేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమానికి గౌరవ సలహాదారులుగా.. రిటైర్డ్ ఎంప్లాయ్ జానాబ్ ఎండి.గులాం యస్దాని,రిటైర్డ్ ఎంప్లాయ్ జానాబ్ ఎండి జాఫర్ లు ,తాత్కాలిక కార్యవర్గ సభ్యులుగా అధ్యక్షులుగా…లెక్చరర్ షేక్ జాన్ పాషా,ప్రధాన కార్యదర్శిగా టీచర్ ఎండి జహీర్ ఖాన్,కార్యవర్గ సభ్యులుగా సీనియర్ అసిస్టెంట్ షేక్ మొయినుద్దీన్,స్కూల్ అసిస్టెంట్ షేక్ సాహెబ్ అలీ,స్కూల్ అసిస్టెంట్ పఠాన్ ఫజలుల్లా ఖాన్,టైపిస్ట్ షేక్ ఖమర్ సుల్తానా,జేవిఓ మహమ్మద్ ఖాన్ సాబ్,పంచాయతి కార్యదర్శి ఎండి మున్వర్ పాషా,ప్రస్తుతం తాత్కాలిక కార్యవర్గ ఎన్నిక నిర్వహించడం జరిగింది.త్వరలో పూర్తిస్థాయి కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతుందని అన్నారు.
కోదాడలో ఎంఎంఈజిఏ (మెగా) కార్యవర్గ ఎన్నిక ,లోగో ఆవిష్కరణ
RELATED ARTICLES



