కోదాడలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు…….
కోదాడ,జులై 24(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు కోదాడలో ఘనంగా నిర్వహించారు.బుధవారం పట్టణ సమీపాన దుర్గాపురం లో గల మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నివాసంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బొల్లం మల్లయ్య యాదవ్ కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించిన యువ నాయకుడు కేటీఆర్ 10 సంవత్సరాలలోనే రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపి హైదరాబాద్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని తెలంగాణ ప్రజల ఆశీస్సులతో భవిష్యత్తులో మరెన్నో ఉన్నతమైన పదవులు చేపట్టి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

త్వరలోనే రాష్ట్ర రథసారధి కావాలని కోరుకుంటూ కోదాడ నియోజకవర్గ ప్రజల తరపున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ఇంటి ఆవరణలో మొక్కలు నాటారు.పట్టణ బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కుక్కడపు.బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చింతా కవితా రాధారెడ్డి,బిఆర్ఎస్ పార్టీ, ముస్లిం మైనార్టీ,కార్మిక విభాగం నాయకులు షేక్.నయీమ్,మామిడి రామారావు,కర్ల సుందర్ బాబు,ముత్తవరపు రమేష్,సాదిక్,సైదులు,నల్ల భూపాల్ రెడ్డి,మాదాల ఉపేందర్,షాకీర్,అబ్బూ,అభిదర్ నాయుడు,బాదే రామారావు తదితరులు పాల్గొన్నారు.