కోదాడలో షీ టీమ్స్ కార్యాలయం ప్రంభించిన ఎమ్మెల్యే,ఎస్పీ.
:మహిళలపై అగాయత్యాలకు పాల్పడితే కటినంగా శిక్షించాలి.
:ఈవ్ టీజింగ్ ను అరికట్టడానికి షీటీమ్స్ బాగా పని చేయాల.
:కోదాడ శాసనసభ్యురాలు నలమాద పద్మావతి రెడ్డి
:మహిళలకు పూర్తి రక్షణ కల్పించడం లక్ష్యం.
:సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్,ఎస్పీ సూర్యాపేట జిల్లా.
Mbmtelugunews//కోదాడలో,ఆగష్టు 29:కోదాడ పట్టణంలో కోదాడ సబ్ డివిజన్ స్థాయి పోలీస్ షీ టీమ్స్ కార్యాలయాన్ని స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ ప్రక్కన గల నూతన బిల్డింగ్ ను కోదాడ శాసనసభ్యురాలు పద్మావతి రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కోదాడ పట్టణంలో మహిళల కు భద్రత కల్పించడం లో భాగంగా షీ టీమ్స్ కార్యాలయాన్ని ప్రారంభించడం చాలా మంచి పరిణామం అని పోలీసు శాఖకు అభినందనలు తెలుపుతున్నాను అని అన్నారు.మహిళలపై జరుగుతున్న ఈవ్ టీజింగ్ ను సమర్థవంతంగా అణచివేయాలని,మహిళలు స్వేచ్చగా తిరిగే వాతావరణం కల్పించాలని పోలీసులను కోరారు.ఇంట్లో,పని చేసే చోట,కార్యాలయాల్లో,విద్యాసంస్థల్లో ఏదోరకంగా ఆడవారికి అవమానం జరుగుతూనే ఉన్నది,దాడులు జరుగుతూనే ఉన్నవి అని,అలాంటి సంస్కృతి మారాలని ఒక మహిళగా అవేదన వ్యక్తం చేశారు.మహిళను గౌరవించాలి,ఆమెకు తగిన ప్రాధాన్యం ఉండాలని అన్నారు.మహిళల పట్ల నేరాలకు పాల్పడే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి,కోదాడ పట్టణంలో,నియోజకవర్గంలో ఈవ్ టీజింగ్ లేకుండా చేయడంలో షీటీమ్స్ బాగా పని చేయాలని కోరారు.ఫిర్యాదులపై త్వరగా స్పందించి బాధిత మహిళలకు బరోసా కల్పించాలని కోరారు.కళాశాలలు,కాలనీలు,అపార్ట్మెంట్స్,గ్రామాల్లో మహిళా భద్రత,షీటీమ్స్ కార్యకలాపాలను విసృతంగా అవగాహన కల్పించాలని స్థానిక పోలీసులను,మున్సిపల్ అధికారులను ఆదేశించారు.జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ మాట్లాడుతూ జిల్లాలో సూర్యాపేట కేంద్రంగా షీటీమ్స్ పని చేస్తున్నాయని,మెరుగైన భద్రత కల్పించడం ఈవ్ టీజింగ్ అరికట్టడానికి కోదాడ సబ్ డివిజన్ లో కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.జిల్లాలో మహిళా భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాము,పూర్తి స్థాయి రక్షణ కల్పించడం పోలీసు లక్ష్యం అన్నారు.షీటీమ్స్ సిబ్బంది కళాశాలలు,కాలనీల్లో మహిళా భద్రత పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు,ఈవ్ టీజింగ్ జరిగే ప్రాంతాలు గుర్తించి సాధారణ పౌరులు లాగా కలిసిపోయి ఈవ్ టీజింగ్ చేసే ఆకతాయిలను గుర్తించి కేసులు నమోదు చేస్తామని అన్నారు.మహిళా దాడులకు సంభందించిన మహిళలు దైర్యంగ పిర్యాదు చేయాలి అని కోరారు.అవసరాన్ని బట్టి పిర్యాదు యొక్క వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుంది అన్నారు.పిర్యాదు చేయడానికి 8712686056 కు ఫోన్ చేయవచ్చు అలాగే డయల్ 100 కు ఫోన్ చేసి పిర్యాదు చేయవచ్చు అన్నారు.ఈకార్యక్రమంలో అదనపు ఎస్పీ నాగేశ్వరరావు,మునిస్పల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల రమేష్,కోదాడ డిఎస్పి శ్రీధర్ రెడ్డి,సిఐలు రజితా రెడ్డి,రాము,చరమంద రాజు,రామకృష్ణా రెడ్డి,స్థానిక ప్రజాప్రతినిధులు,ఎస్ఐలు,షీ టీమ్స్ సిబ్బంది,పోలీసు సిబ్బంది ఉన్నారు.