కోదాడ,అక్టోబర్ 19(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కోదాడ పట్టణంలో సత్వర వైద్య సేవలు అందుబాటులోకి తేవడం అభినందనీయమని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.గురువారం కోదాడ పట్టణంలోని హుజూర్నగర్ రోడ్డులో డాక్టర్ సుబ్బారావు వైద్యశాల ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన స్వాతి హాస్పిటల్లో వారు ప్రారంభించి మాట్లాడారు.కోదాడ ప్రాంత ప్రజలు సుదూర నగరాలకు వెళ్లకుండా అందుబాటులో కార్పొరేట్ వైద్య సేవలు అందుబాటులోకి చేస్తున్న కోదాడ ప్రాంత వైద్యులను అభినందించారు.ఆపద సమయంలో వ్యాపార దృక్పథంతో కాక సేవా దృక్పథంతో వైద్య సేవలు అందించి ప్రజల ప్రాణాలు కాపాడాలని వైద్యులను సూచించారు. వైద్య వృత్తి ఎంతో పవిత్రమైందని కొనియాడారు.స్వాతి వైద్య శాల ఏర్పాటు చేసిన వైద్యులు డాక్టర్ నర్సింగ్ రంజిత్,డాక్టర్ స్వాతి జ్యోతిర్మయి లను వారు అభినందించారు.వైద్యశాలలో అందుబాటులో ఉండే సౌకర్యాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా వైద్యశాల యాజమాన్యం ఎమ్మెల్యే లను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీపతి రెడ్డి,డాక్టర్ ప్రమీల,డాక్టర్ ఏ రామారావు,డాక్టర్ ప్రసాద్,డాక్టర్ సురేష్,డాక్టర్ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కోదాడలో స్వాతి వైద్యశాలను ప్రారంభించిన ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
RELATED ARTICLES



