కోదాడ ఇంటర్ స్కూల్ క్రికెట్ చాంపియన్షిప్ సీజన్ -3 పోస్టర్ ఆవిష్కరణ
Mbmtelugunews//కోదాడ,జనవరి 01(ప్రతినిధి మాతంగి సురేష్):బుధవారం బాలుర ఉన్నత పాఠశాల కోదాడ నందు కోదాడ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి సురేష్ అధ్యక్షతన జరిగింది.కోదాడ ఇంటర్ స్కూల్ క్రికెట్ చాంపియన్షిప్ సీజన్ -3 పోస్టర్ ఆవిష్కరణ చేశారు.గత రెండు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసిన అనుభవంతో ఈ మూడో సీజన్ ఫిబ్రవరి 1,2 తేదీలలో మరింత ఘనంగా నిర్వహించేందుకు కృషి చేయాలని ఆయన అన్నారు.ఈ టోర్నమెంట్‌లో కోదాడ,హుజూర్ నగర్ నియోజకవర్గాల పరిధిలో గల పాఠశాలలు పాల్గొనవచ్చు.ప్రతి పాఠశాల నుండి ఒకే జట్టును స్వీకరించబడుతుంది.ఈ టోర్నమెంట్ విద్యార్థుల ప్రతిభను నిరూపించుకునే మంచి వేదికగా నిలుస్తుందని,గత సీజన్లలో పాల్గొన్న క్రీడాకారులు వారి ప్రతిభను మెరుగుపరచుకుని జిల్లా మరియు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నారని ఆయన గుర్తు చేశారు.ఈ సందర్భంగా కోదాడ క్రికెట్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు కోదాడ మండల విద్యాధికారి ఎండి సలీం షరీఫ్ మాట్లాడుతూ క్రీడలు విద్యలోని ఒక ముఖ్య అంశం.క్రీడలు విద్యార్థుల్లో స్నేహభావం,జాతీయ ఐక్యతను పెంపొందించడమే కాకుండా శారీరక మరియు మానసిక దృఢత్వాన్ని అందిస్తాయి,ప్రతి పాఠశాల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని తెలిపారు.ఈ కార్యక్రమంలో కోదాడ క్రికెట్ అసోసియేషన్ ప్రథాన కార్యదర్శి షేక్ సిద్ధిఖ్,చందా శ్రీనివాస రావు,ఖాజా మియా,నాగేశ్వరరావు,జబ్బార్,సైదులు,శ్రీకాంత్,తదితరులు పాల్గొన్నారు.