కోదాడ కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలపై అసత్య ప్రచారాలను ఖండిస్తున్నాం
:ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనార్టీ బాలికలకు విద్యానందిస్తున్న కళాశాల యాజమాన్యంపై కక్ష సాధింపు సరికాదు.
:గ్రామీణ ప్రాంత విద్యార్థినిలకు అందుబాటులో సాంకేతిక విద్యనందిస్తున్న కళాశాలకు అండగా ఉంటాం.
:గిరిజన విద్యార్థి సంఘ నాయకుడై ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు చదువుతున్న కళాశాలపై ఫిర్యాదులు చేయడం సరికాదు.
:ఎల్ హెచ్ పి ఎస్ ఆధ్వర్యంలో త్వరలో జేఎన్టీయూ విసిని కలుస్తాం..
:ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కోట్యా నాయక్
కోదాడ,మే 14(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:ఉమ్మడి జిల్లాలోని ఏకైక మహిళా కళాశాల గా గుర్తింపు పొందిన కోదాడ కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలపై కొందరు వ్యక్తులు చేస్తున్న అసత్య ప్రచారాలను ఎల్ హెచ్ పి ఎస్ సంఘం పక్షాన ఖండిస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోట్యా నాయక్,రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజు నాయక్ లు అన్నారు.మంగళవారం కోదాడ పట్టణంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు గ్రామీణ ప్రాంతాల్లోని ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీ వర్గాల బాలికలకు ఉన్నత ప్రమాణాలతో విద్యను అందిస్తున్న కళాశాల కిట్స్ కళాశాల అన్నారు.యూనివర్సిటీలో విద్యార్థి సంఘ నాయకుడిగా చలామణి అవుతూ గ్రామీణ ప్రాంతా విద్యార్థులు చదివే కళాశాల కు అనుమతులు రాకుండా ఫిర్యాదులు చేయడం సమంజసం కాదన్నారు.

బేటి పడావో బేటి బచావో అనే నినాదానికి అనుగుణంగా కళాశాల బాలికలకు ప్రమాణాలతో కూడిన విద్యానందిస్తుందన్నారు.కళాశాల యాజమాన్యం ఎంతోమంది పేద విద్యార్థినిలకు విద్యతో పాటు ఉచిత వసతి కూడా కల్పించిందన్నారు.కళాశాల నుండి వందలాది మంది విద్యార్థులు ఉన్నత విద్యాలభ్యసించి ఉన్నత లక్ష్యాలకు చేరుకున్నారని తెలిపారు.కళాశాలలో చదివే విద్యార్థులకు అండగా ఎల్ హెచ్ పి ఎస్ ఉంటుందన్నారు.త్వరలో ఎల్ హెచ్ పి ఎస్ ఆధ్వర్యంలో జేఎన్టీయూ విసి ని కలుస్తామన్నారు.ఈ సమావేశంలో ఎల్ హెచ్ పి ఎస్ జిల్లా అధ్యక్షులు రవి నాయక్,నియోజకవర్గ అధ్యక్షులు నాగేశ్వరరావు నాయక్,నాయకులు సంజయ్ గాంధీ,నాగరాజు,శివాజీ నాయక్,బాలాజీ నాయక్,భోజ్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు.



