Monday, December 29, 2025
[t4b-ticker]

కోదాడ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో గేట్ వే క్రికెట్ లీగ్ 2024 ప్రారంభం

కోదాడ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో గేట్ వే క్రికెట్ లీగ్ 2024 ప్రారంభం

:క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీరిక దృఢత్వానికి ద్రోహత పడతాయి.

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ కు మంచి ఆదరణ గుర్తింపు కలదు:పట్టణ సిఐ రాము

కోదాడ,జూన్ 08(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కోదాడ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో గేట్ వే క్రికెట్ లీగ్ 2024 కేఆర్ఆర్ డిగ్రీ కళాశాల ఆవరణలో జూన్ 8,9 క్రికెట్ పోటీలను కోదాడ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో ప్రారంభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోదాడ పట్టణ సిఐ రాము పాల్గొని క్రికెట్ పోటీలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా
క్రీడాకారులను ఉద్దేశించి సిఐ రాము మాట్లాడుతూ
క్రీడలు మానసిక ఉల్లాసం తో పాటు శారీరక ఎదుగుదల కోసం ఎంతగానో దోహదం చేస్తాయన్నారు.క్రికెట్ కేవలం ఆట కాదు ఇది మనల్ని బంధించి,హద్దులు దాటి,అందరిని ఒకే వేదికపైకి తీసుకువస్తుందన్నారు.గేట్‌వే క్రికెట్ లీగ్ ఈ స్ఫూర్తికి నిదర్శనంగా నిలుస్తోందని అన్నారు.ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ కు ఎంతో ప్రాధాన్యత కలిగి ఉందని అన్నారు.వయసుతో సంబంధం లేకుండా చిన్నారులు పెద్దలు కలిసి ఆడే ఒక క్రీడా అని అన్నారు.

యువ క్రికెటర్లు తమ నైపుణ్యాలను ప్రదర్శించేందుకు వారి కలలను సాకారం చేసుకోవడానికి కోదాడ క్రికెట్ అకాడమీ ఒక సువర్ణావకాశాన్ని అందిస్తుందన్నారు.కోదాడ క్రికెట్ అకాడమీ క్రికెట్ క్రీడాకారులను శిక్షణ ఇస్తున్న కోచ్ సిద్దిక్ ను ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో కోదాడ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు డా,,కొత్తపల్లి సురేష్ ,శ్రీలత,మీరా,ఖాజా మియా,రాజు,జబ్బార్,బుల్లయ్య,రిజ్వానా,క్రికెట్ అసోసియేషన్ సభ్యులు,అకాడమీ నిర్వాహకులు,క్రీడాకారులు,క్రీడాకారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular