కోదాడ గేట్ వే క్రికెట్ లీగ్ విజేతలకు బహుమతి ప్రధానోత్సవం చేసిన కోదాడ పట్టణ సీఐ రాము
కోదాడ,జూన్ 09(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కోదాడ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో గేట్ వే క్రికెట్ లీగ్ 2024 కెఆర్ఆర్ డిగ్రీ కళాశాల ఆవరణలో జూన్ 8,9 నిర్వహించిన క్రికెట్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానోత్సవం చేసిన సిఐ రాము, మండల విద్యాధికారి మొహమ్మద్ సలీం షరీఫ్.అనంతరం
క్రీడాకారులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ
క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక ఎదుగుదల కోసం ఎంతగానో దోహదం చేస్తాయన్నారు.

ఈ టోర్నమెంట్లో ఈగల్ వారియర్స్ టీం మొదటి బహుమతిని గెలుచుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉందని ఓడిపోయిన క్రీడాకారులు బాధపడకుండా ట్రై చేసినట్లయితే రాబోయే పోటీలలో విజయతలగా నిలుస్తారని క్రికెట్ కి ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉందని గుర్తు చేశారు.విద్యార్థులు ఆటలకే పరిమితం కాకుండా చదువులలో కూడా మంచిగా రానించి ఉన్నత శిఖరాలను అధిరోహించి తల్లిదండ్రులకు గురువులకు గొప్ప గౌరవాన్ని తీసుకురావాలని అన్నారు.కోదాడ క్రికెట్ అకాడమీ క్రికెట్ క్రీడాకారులను శిక్షణ ఇస్తున్న కోచ్ సిద్దిక్ ను ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ పార్థసారథి, డాక్టర్ రాజేష్ రెడ్డి, మీరా , శ్రీనివాస రాజు, జబ్బర్, రిజ్వానా, శ్రీకాంత్, రఫీ,కోదాడ క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు చంద్ర శీను, ట్రెజరర్ లక్ష్మీనారాయణ, క్రికెట్ అసోసియేషన్ సభ్యులు, అకాడమీ నిర్వాహకులు, క్రీడాకారులు క్రీడాకారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.



