కోదాడ,నవంబర్ 10 (mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కోదాడ జనసేన కార్యకర్తలు ఒక్కసారిగా బగ్గుమన్నారు,నిరసనలు తెలిపారు.కోదాడ నియోజకవర్గం బిజెపి జనసేన పొత్తుతో ఎన్ డిఏ అభ్యర్థిగా మేకల సతీష్ రెడ్డిని కోదాడ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా బీజేపీ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ప్రకటిస్తూ స్థానిక పెరిక భవన్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.ఈ ప్రెస్ మీట్ అనంతరం కోదాడ జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేసుకుంటూ చుట్టం చూపుగా వచ్చి పోయే వారికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించవద్దు లోకల్ గా ఉన్న అభ్యర్థులకు మాత్రమే ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలి అని నిరసనగలం వినిపించారు.కనీసం కార్యకర్తల ఫోన్ లేపని వ్యక్తులకు ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తే మేము ఎలా పని చేయాలి అని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జనసేన కోదాడ నియోజకవర్గ ఇన్చార్జి కుడుముల ప్రశాంత్,నియోజకవర్గ ఆర్గనైజింగ్ సెక్రటరీ కస్తూరి సురేష్,కోదాడ మండల అధ్యక్షులు రాము నాయుడు,చిలుకూరు మండల అధ్యక్షులు సిద్దెల అంజిబాబు,అనంతగిరి మండల అధ్యక్షులు రేపాకుల నరేష్,కుడుముల శివ,రజిని,శేఖర్,షేక్ నజీర్,అభి,కస్తూరి నాయుడు,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
కోదాడ జనసేన లో బగ్గుమన్న అసమతి సెగ
RELATED ARTICLES



