కోదాడ,నవంబర్ 17(MBMTELUGUNEWS) ప్రతినిధి మాతంగి సురేష్:కోదాడ టౌన్ టిడిపి ప్రధాన కార్యదర్శి మైకు నాగుల్ భారత చైతన్య యువజన పార్టీ చెరుకు గడ రైతు గుర్తు కోదాడ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ అబ్దుల్ మాలిక్ ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకొని పార్టీలో జాయిన్ అయినారు.ఈ సందర్భంగా అబ్దుల్ మాలిక్ మాలిక్ మాట్లాడుతూ భారత చైతన్య యువజన పార్టీలో వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరుతున్నారని ఈ చేరికలతో కోదాడ నియోజకవర్గంలో బీసీవై జెండా ఎగరవేయడం ఖాయం అని అన్నారు.బీసీవై జెండా ఎగిరిన మరుక్షణమే కోదాడ నియోజకవర్గం రూపురేఖలు మార్చేస్తానని ఆయన అన్నారు.వ్యవస్థ మారితేనే జీవితాలు బాగుపడతాయి దీనికి మన అందరి ప్రయత్నం అవసరమని మార్పు కోసం ముందడుగు వేసి బీసీవై పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.ఈ కార్యక్రమంలో బిసివై నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కోదాడ టౌన్ టిడిపి ప్రధాన కార్యదర్శి మైకు నాగుల్ బీసీవై పార్టీలో చేరిక
RELATED ARTICLES



