కోదాడ నియోజకవర్గంలో వరద ప్రాంతాలను పరిశీలించిన మంత్రి ఉత్తమ్,ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి
Mbmtelugunews//కోదాడ,సెప్టెంబర్ 02:సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆంధ్ర,తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన కోదాడ మండల పరిధిలోని నల్లబండగూడెం వద్ద పాలేరు వాగు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో జాతీయ రహదారిపై దెబ్బతిన్న ప్రాంతాన్ని పరిశీలించిన భారీ నీటిపారుదల శాఖ,పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి,సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవార్,ఐపీఎస్ ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఆధ్వర్యంలో ఈ బ్రిడ్జిని,దెబ్బతిన్న రహదారి ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది.
అనంతరం నడిగూడెం మండల పరిధిలోని కాగిత రామచంద్రాపురం వద్ద నాగార్జునసాగర్ ఎడమ కాలువకు గండిపడిన ప్రదేశాన్ని పరిశీలించినారు.అనంతరం దెబ్బ తిన్న తమ్మర బ్రిడ్జిని పరిశీలించినారు.ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మరో రెండు రోజులపాటు సూర్యాపేట జిల్లాకు వర్ష సూచన ఉందని ప్రజల అప్రమత్తంగా ఉండాలని విజయవాడకు వెళ్లే ప్రయాణికులు నార్కెట్ పల్లి,నల్లగొండ,మిర్యాలగూడ వయా గుంటూరు మీదుగా వెళ్లాలని తొందరలోనే నేషనల్ హైవే వారితో మాట్లాడి బ్రిడ్జి పునరుద్ధరించడం జరుగుతుందని ప్రయాణికులు పోలీస్ అధికారులకు స్థానిక అధికారులకు సహకరించాలని తెలియజేశారు.పంట నష్టం జరిగిన రైతులను అంచనా వేసి ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు.
వర్షాలకు పూర్తిగా ధ్వంసమైన ఇండ్లకు కూడా ఆర్థిక సహాయం ప్రభుత్వం ద్వారా అందిస్తామని అన్నారు.చనిపోయిన వారికి ఎక్స్ గ్రేషియా కూడా ప్రభుత్వం ద్వారా ప్రకటిస్తామని తెలిపారు.