Monday, December 23, 2024
[t4b-ticker]

కోదాడ నియోజకవర్గంలో 100 కోట్లతో రోడ్ల అభివృద్ధి..

- Advertisment -spot_img

కోదాడ నియోజకవర్గంలో 100 కోట్లతో రోడ్ల అభివృద్ధి..

:25 కోట్లతో మోతే డబుల్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన.

:డబుల్ రోడ్డు తో పాటు ఇంటర్నల్ సిమెంట్ రోడ్ల నిర్మాణం చేపడతాం.

:కోదాడ ప్రాంత సర్వతోముఖాభివృద్ధి మా లక్ష్యం.

Mbmtelugunews//కోదాడ/డిసెంబర్ 02(ప్రతినిధి మాతంగి సురేష్):కోదాడ పట్టణానికి వంద పడకల ఆసుపత్రి హాస్పిటల్ లో ప్రజల సౌకర్యార్థం సిటీ స్కాన్ ఏర్పాటు,రైతుల కొరకు అన్ని లిఫ్టులు పూర్తిస్థాయిలో మరమ్మత్తులు చేపడుతున్నామని మంత్రి తెలిపారు.కోదాడ నియోజకవర్గం లోని అన్ని ప్రాంతాలు పారుదలై మంచి పంటలు పండే విధంగా చర్యలు తీసుకుంటాం 40 కోట్లతో రెడ్డి గుంటకు లిఫ్ట్ మంజూరు చేసాం సాగునీటికి త్రాగునీటికి విద్య కొరకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం సామాన్యులకు అనుకూలంగా వసతులు కల్పిస్తున్నాం సంవత్సర పాలనలో 10 సంవత్సరాలు చేయని అభివృద్ధి చేసి చూపించాం కాలేశ్వరం ద్వారా నీటి చుక్క రాకపోయినా

ఈ వానాకాలం రాష్ట్రంలో 66.7 లక్షల ఎకరాలలో 45 లక్షల మంది రైతులు 1503 లక్షల మెట్టు వరి ధాన్యాన్ని పండించామని దేశంలో మరెక్కడ ఇంత పంట రాలేదని మంత్రి తెలిపారు.సన్నాలకు 500 రూపాయల బోనస్ అందిస్తున్నాం సుమారుగా 40 వేల కోట్ల రూపాయలు ఈసారి వరి ధాన్యం పంట వల్ల రైతుల ఖాతాలో జమ చేస్తున్నాం మంచిగా పాలన అందిస్తు అందరి ఆశీస్సులు పొందుతున్నాం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీలను అమలుపరుస్తున్నాం మహిళలకు ఉచిత బస్సు 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా అందిస్తున్నాం రైతు భరోసా సంక్రాంతి పండుగ తర్వాత రైతు ఖాతాలో జమ చేస్తాం వసతి గృహాల్లో చదువుకుంటున్న విద్యార్థుల కొరకు మెస్ చార్జీలు డైట్ చార్జీలు పెంచాం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం.ఈ కార్యక్రమంలో కోదాడ శాసనసభ్యులు ఉత్తమ్ పద్మావతి,జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్,మాజీ శాసనసభ్యులు వి చందర్రావు,గ్రంథాలయ చైర్మన్ వి రామారావు,ఆర్డిఓ వేణుమాధవ్,ఏసీపి నాగేశ్వరరావు,ఆర్అండ్ బి ఈఈ సీతారామయ్య,మోతే తాసిల్దార్ ఎస్ సంఘమిత్ర,ప్రజాప్రతినిధులు,అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular