కోదాడ నియోజకవర్గ పశువైద్య శాఖ మెరుగైన సేవలకు అత్యవసర సమావేశం
Mbmtelugunews//కోదాడ, జులై 11 (ప్రతినిధి మాతంగి సురేష్): స్థానిక శాసన సభ్యులు నలమాద ఉత్తమ్ పద్మావతి ఆదేశాను సారం పశువైద్య శాఖాభివృద్ధికి కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలలో నియోజకవర్గ పశువైద్య మరియు పశుసంవర్ధక శాఖ అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమానికి జిల్లా పశువైద్య మరియు పశుసంవర్ధక అధికారి డా, దాచేపల్లి శ్రీనివాసరావు పాల్గొని అభివృద్ధి ప్రణాళిక తయారు చేయనైనది. దశాబ్దకాలం క్రితం ఆపివేసిన గొర్రెల పెంపకం దారులకు ఉచిత నత్తలనివారణ మందుల కార్యక్రమం రాష్ట్రంలో ఎక్కడా లేకున్నా కోదాడ నియోజక వర్గంలో తొలిగా పునఃప్రారంభం కొరకు నియోజకవర్గం పరిధిలో అన్ని గ్రామాల్లో ఉన్న గొర్రెలు మేకల పెంపకం దారుల జీవాలకు ఉచిత నత్తలనివారణ మందుల పంపిణీ శాసన సభ్యుల వారి సహకారంతో త్వరలో పండుగవాతావరణంలో ఏర్పాటు చేయడం జరుగుతుందని అందుకు కావాల్సిన ప్రచారం ఏర్పాట్లు చేసుకోవాలని పశువైద్య సహాయ శస్త్రచికిత్సకులకు సూచించారు.
పశువైద్యశాలల్లో అవసరమైన మౌలిక వసతులకు కోదాడ ప్రాంతీయ పశువైద్యశాల నూతన భవనం నిర్మాణానికి ఒక కోటి ఇరవై అయిదు లక్షలు, నియోజకవర్గం లోని 11 ప్రాథమిక పశువైద్య కేంద్రాలు, 19 పశు ఆరోగ్య ఉపకేంద్రాలలో అవసరం ఉన్న చోట 55 లక్షలు 45 లక్షలతో నూతన భవనాలు, అదనపు గదులు, శౌచాలయాలు, ప్రహరీ గోడల నిర్మాణం, ట్రెవిస్, ట్రావిస్ షెడ్స్, రైతుల సౌకర్యంకోసం వసతుల ఏర్పాటు తదితర నిర్మాణాలకు ప్రతీ మండలం నుండి అవసరాలు సేకరించి మొత్తం 6.0 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు ప్రణాళికలు తయారు చేయనైనది.సమీక్షా సమావేశములో స్థానిక అసిస్టెంట్ డైరెక్టర్ డా పి పెంటయ్య నియోజక వర్గ 11 ప్రాథమిక పశువైద్య కేంద్రాల పశువైద్య శస్త్రచికిత్సకులు పాల్గొన్నారు.