కోదాడ నియోజకవర్గ పాస్టర్స్ ఫెలోషిప్ నూతన కమిటీ ఎన్నిక
Mbmtelugunews//కోదాడ, మార్చి 20: నియోజకవర్గ పాస్టర్స్ నూతన కమిటీని శుక్రవారం కోర్ కమిటీ చైర్మన్ రెవ డాక్టర్ కె శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడింది. నియోజకవర్గ అధ్యక్షుడిగా కె రామారావు, గౌరవ అధ్యక్షులుగా యేసురత్నం, వైస్ ప్రెసిడెంట్ పి డేవిడ్ రాజు , వర్కింగ్ ప్రెసిడెంట్ పి రమేష్, సెక్రటరీ కోర్నేలిబాబు, జాయింట్ సెక్రెటరీ డి దానియేలు, ట్రెజరర్ పి పాల్ చారి, చీఫ్ –కో -ఆర్డినేటర్ ఇస్మాయేల్ లను ఏకగ్రీవంగా ఏర్పాటు ఎన్నుకున్నారు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా రెవరెండ్ డాక్టర్ వి యేసయ్య, వైస్ చైర్మన్ గా శాంత వర్ధన్, టి ఇర్మియా లను ఏర్పాటు చేశారు. కోదాడ పట్టణ కమిటీ అధ్యక్షుడుగా రెవరెండ్ సైమన్, వర్కింగ్ ప్రెసిడెంట్ కె ప్రభుదాస్, గౌరవ అధ్యక్షులుగా జోసఫ్ రాజు, వైస్ ప్రెసిడెంట్ గుండు దానియేల్, సెక్రటరీ జి ఆమోస్, ట్రెజరర్ బి నాగేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. యూత్ కమిటీ ప్రెసిడెంట్ గా కె సురేష్, ఉపాధ్యక్షులుగా పి నిస్సి, సెక్రటరీ ప్రియదర్శన్, ట్రెజరర్ కే ఎనోష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ క్రైస్తవ నాయకులు బిషప్ ఏజే శామ్యూల్, డాకూరి ప్రభుదాస్, పరంజ్యోతి, గుడిబండ ఏసయ్య, లాజర్, సిల్వరాజు, గబ్రీల్ తదితరులు పాల్గొన్నారు.



