కోదాడ నియోజకవర్గ మాదిగ సమ్మేళనం కార్యక్రమం ను విజయవంతం చేయాలి
Mbmtelugunews//కోదాడ,నవంబర్ 14(ప్రతినిధి మాతంగి సురేష్)మాదిగ సమ్మేళన కార్యక్రమానికి మాదిగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు అలాగే ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డా పిడమర్తి రవి హాజరవుతున్నారని తెలంగాణ రాష్ట్ర మాదిగ జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంటు కొండమీది గోవింద రావు అన్నారు.కోదాడ అంబేద్కర్ కాలనీలో జరిగినటువంటి మీడియా సమావేశంలో కొండమీద గోవిందరావు మాట్లాడుతూ …
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ 59 ఉపకులాల్లో అత్యధిక జనాభా కలిగినటువంటి మాదిగలకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం ఏ,బి,సి,డి వర్గీకరణ లో భాగంగా ఏ6:బి7:సి1:డి1 శాతాలుగా రిజర్వేషన్ చేయడం వల్ల మాదిగలకు నష్టం జరుగుతుందని ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మాదిగల జనాభా ఎక్కువ ఉంది కాబట్టి మాదిగలకు 7 శాతం రిజర్వేషన్ సరిపోదని జనాభా ప్రకారం 12 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ నిమిత్తం తెలంగాణ రాష్ట్ర మాదిగలు ఏకం కావాలని అందులోనే భాగంగా కోదాడ నియోజకవర్గంలోని మాదిగలు కూడా డాక్టర్ పిడమర్తి రవి నాయకత్వంలో ఉద్యమం చేయాలని భారత రాజ్యాంగం ఎస్సీలకు కల్పించినటువంటి 15% రిజర్వేషన్లు అత్యధిక జనాభా కలిగినటువంటి మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించే దాకా పోరాడాలని పిలుపునిస్తూ రేపు 15.11.2024 న కోదాడ నియోజకవర్గంలో జరిగే పోయే మాదిగల సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కోరటం జరిగింది.ఈ మీడియా సమావేశంలో మాదిగ జేఏసీ సూర్యాపేట జిల్లా మహిళా అధ్యక్షురాలు ముండ్లపాటి మాణిక్యం,మాదిగ జేఏసీ కోదాడ నియోజకవర్గ నాయకులు చింత కుమార్ మాదిగ,జేఏసీ నాయకులు కుడుముల రవి,గోపి,వేణు తదితరులు పాల్గొనడం జరిగింది…