కోదాడ నియోజక వర్గాన్ని వ్యవసాయంలో సస్యశ్యామలం చేస్తాము
:రెడ్లకుంట ఎత్తిపోతల ప్రాజెక్టును మే నెల చివరి వరకు నిర్మాణ పనులను పూర్తి చేయాలి
:రాష్ట్ర ఆహార పౌరసరఫరాల మరియు నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి
Mbmtelugunews//కోదాడ, మర్చి 04(ప్రతినిధి మాతంగి సురేష్): రెడ్లకుంట ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులు వేగం పెంచాలని, నాణ్యతా ప్రమాణాల్లో రాజీ పడవద్దని మే నెల చివరి వరకు ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులను పూర్తి చేయాలని అధికారులను ,కాంట్రాక్టర్ లను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. బుధవారం పాలేరు వాగుపై రెడ్లకుంట వద్ద నిర్మిస్తున్న రెడ్లకుంట ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులను అధికారులతో కాంట్రాక్టర్లతో కలిసి పరిశీలించారు. తదుపరి మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ బలహీన వర్గాల ప్రజలకు మేలు చేసేందుకే ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో నియోజక వర్గంలో పలు ఎత్తిపోతల పథకం నిర్మాణ పనుల ప్రాజెక్టులు చేపట్టామని, రెడ్లకుంట వద్ద రూ.14 కోట్ల రూపాయలతో ఎత్తిపోతల పథకాన్ని చేపట్టామని, ఈ పథకం ద్వారా నల్లబండగూడెం, కాపుగల్లు, రెడ్ల కుంట పరిధిలో 4,500 ఎకరాలకు సాగునీరు అందుతుందని అలాగే గ్రామాలలో త్రాగునీరు కూడ అందించడం జరుగుతుందని,

ప్రాజెక్టు భూసేకరణ నిమిత్తం 3 ఎకరాల 39 కుంటల భూమి సేకరించి రైతులకు 2 కోట్లు చెల్లించనైనదని, ఈ ఖరీఫ్ సీజన్లో దేశంలో ఎక్కడలేని విధంగా తెలంగాణలో అత్యధిక వరి పంట పండి రికార్డ్ సృష్టించినదని, మొత్తం 72 లక్షల మెట్రిక్ టన్నుల వరి పండినదని, రైతుల నుండి కొనుగోలు, బోనస్ మొత్తము కలిపి రూ.19,800 కోట్లు చెల్లించామని, రాజకీయాలకు అతీతంగా కోదాడ, హుజూర్ నగర్ రెండు నియోజకవర్గాలను ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి నేను కలిసి అభివృద్ధి చేస్తామని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ సిఇ రమేష్, ఇరిగేషన్ ఎస్సీ నాగభూషణరావు, ఇరిగేషన్ ఈఈ సత్యనారాయణ, ఆర్డిఓ సూర్య నారాయణ,ఏ ఈ మహేష్ నీటిపారుదల అధికారులు, గుత్తందారులు, అధికారుల, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.



