కోదాడ నుండి తిరుమలగిరి శ్రీవారి పాదయాత్ర..
Mbmtelugunews//కోదాడ,నవంబర్ 05 (ప్రతినిధి మాతంగి సురేష్):కోదాడ మున్సిపల్ పరిధిలోని శ్రీరంగాపురం ఆంజనేయ స్వామి దేవాలయం నుండి తిరుమలగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధి వరకు శనివారం 9 నవంబర్ 2024..తెల్లవారుజామున 4 గంటలకు ఓరుగంటి కిట్టు మిత్ర మండలి ఆధ్వర్యంలో శ్రీవారి పాదయాత్ర కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఓరుగంటి కిట్టు మిత్రమండలి కన్వీనర్ ముషం రవి ఒక ప్రకటనలో తెలిపారు.ఈ నెల 9వ తేదీ శనివారం తెల్లవారుజామున కోదాడ మున్సిపల్ పరిధిలోని శ్రీరంగాపురం ఆంజనేయ స్వామి దేవస్థానం నుండి తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి సన్నిధి వరకు కాలినడకన చేరుకునే మహత్తర కార్యక్రమమును జయప్రదం చేయవలసిందిగా భక్త మహాశయులకు విజ్ఞప్తి చేయుచున్నట్లు తెలిపారు.పాదయాత్రలో పాల్గొని భక్తులు సాంప్రదాయ దుస్తులలో రావాల్సిందిగా కోరనైనది. వివరాలకు 9849354654 నెంబర్ ను సంప్రదించగలరు.