కోదాడ,నవంబర్ 17(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:పట్టణంలోని కొమరబండ11వ వార్డులో ముఖ్యమైన 11 సమస్యలపై 11వ వార్డుకి చెందిన యువశక్తి యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు,ప్రజా ఉద్యమ నాయకులు దాసరి జయసూర్య కరపత్రాన్ని ముద్రించారు. శుక్రవారం ఈ కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమా న్ని నిర్వహించారు.అనంతరం జయ సూర్య మాట్లాడుతూ మనకు స్వాతంత్ర్యo వచ్చి 77 సంవత్సరాలు దాటిన కనీసం స్మశానవాటిక లేకపోవడం దురదృష్టకరమని తెలిపారు.కొమరబండ గ్రామాన్ని ఈ మధ్యకాలంలో కోదాడ మున్సిపాలిటీలో కలపడం జరిగింది.మున్సిపాలిటీలో కలిసి 11వార్డుగా ఏర్పడినప్పుటికి నాయకులు వస్తున్నారే తప్ప అభివృద్ధి శూన్యం.వార్డులో ఉన్న సమస్యలు.1, వార్డులో నివాసం ఉంటున్న రైతుల భూములకు పట్టాలు ఇవ్వడం.2, తాగునీటి శాశ్వత పరిష్కారం చేయాడం.3, చెరువు నీరు పంట పొలాలకు వచ్చే కాలువను శాశ్వత మరమ్మతులు చేయడం పంట పొలాలకి నీటిని మళ్ళించడం.4, ప్రతి నిరుపేద కుటుంబాన్ని గుర్తించి వారికి పక్కా ఇల్లు కట్టించడం.5, కమిటీ హాల్ ను నిర్మించడం.6, ఒకే గదితో ఇబ్బందిగా ఉన్న ప్రైమరీ స్కూలు నీ విశాలంగా నిర్మించడం.7, 11వార్డులో ఎస్సీలకు కేటాయించిన అంగన్వాడి కేంద్రానికి సంబంధించిన భవన నిర్మాణం 11 వార్డ్ లోనే చేపట్టాలని.8, పర్యావరణ కాలుష్యానికి మరియు ప్రజల అనారోగ్యానికి కారణమవుతున్న రైస్ మిల్లుల్ని వెంటనే మూసివేయాలని.. ఇలా పలు రకాల సమస్యలు ఉన్న ఈ వార్డు ని దృష్టిలో ఉంచుకొని సమస్యలు పరిష్కరించిన వారికే రాజకీయపరంగా సపోర్ట్ చేస్తామని డిమాండ్ చేశారు.ఇక్కడ నాలుగు సార్లు వేనేపల్లి చందర్రావు,రెండుసార్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి,ఒకసారి ఉత్తమ్ పద్మావతి,ఒకసారి బోల్లం మల్లయ్య యాదవ్ గెలిచిన ఈ సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న సామెతను నిరూపించినాయి అన్నారు… ఇప్పడికైన నాయకులు చొరవ తీసుకొని ఈ సమస్యలను పరిష్కరించాలని కోరుచున్నాము..ఇట్టి కార్యక్రమంలో మంద నాగేంద్రబాబు,దేవపoగు జగన్,గుంజలూరి నాగేంద్రబాబు,నెమ్మది నాగరాజు,గుంజలూరి నాగేష్,సూరపల్లి శంబయ్య,చింతా ధనుమూర్తి,కోటేశ్వరరావు,సత్యబాబు,11వ వార్డు మహిళలు,అధికారులు,ప్రజా ప్రతినిధులు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
కోదాడ పట్టణంలోని 11వ వార్డులో ఎస్సీ కాలనీలో అరకొర పనులతో అవస్థలు పడుతున్న సామాన్య ప్రజలు.
RELATED ARTICLES



