కోదాడ,ఆగష్టు 09(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:పేదలు ఆత్మ గౌరవంగా బ్రతికెందుకు సీఎం కెసిఆర్ డబుల్ బెడ్ రూమ్ పథకం తీసుకురావడం జరిగిందని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.బుధవారం కోదాడ పట్టణం బాలాజీ నగర్ లో 32 కోట్ల 24 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన 560 డబల్ బెడ్ రూమ్ ఇండ్లను ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పంపిణీ చేశారు.అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా డబల్ బెడ్ రూమ్ ఇళ్లను అందించాలని లక్ష్యంతో నిర్మించారని ఆయన అన్నారు.పేదలు ఆత్మగౌరవం తో జీవించడానికి మన డబుల్ బెడ్ రూం ఇండ్లు అని ఆయన తెలిపారు.అభివృద్ధి-ప్రజా సంక్షేమం ప్రభుత్వానికి రెండు కండ్లు అని ఆయన అన్నారు.గత ప్రభుత్వాలు,ఇరుకు గదులు,ఇబ్బందులతో కూడిన నిధులు,అతి తక్కువ వ్యయంతో అరకొర వసతులతో ఇచ్చిన ఇండ్లు కాకుండా,సిఎం కెసిఆర్ తెలంగాణలోని నిరుపేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉండే విధంగా డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నారని ఆయన తెలిపారు.ప్రభుత్వమే సొంతంగా నిర్మించి,లబ్ధిదారులకు అప్పగిస్తున్నదని ఆయన అన్నారు.ఇలా ఏ రాష్ట్రంలోనూ జరగడం లేదని ఆయన చెప్పారు.ప్రభుత్వం నిరుపేదల పక్షపాతిగా పని చేస్తుంది అని ఆయన తెలిపారు.అభివృద్ధి-సంక్షేమాలే రెండు కండ్లుగా కెసిఆర్ పాలన సాగిస్తున్నారని అని అన్నారు.పేదలు ఆత్మ గౌరవంగా బ్రతికెందుకు సీఎం కెసిఆర్ డబుల్ బెడ్ రూమ్ పథకం అమలు చేయడం జరుగుతుంది అని ఆయన గుర్తు చేశారు.నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ దక్కలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన అని ఆయన అన్నారు.సొంత స్థలం ఉన్న పేద ప్రజలకు ఇండ్ల నిర్మాణానికి రూ.3లక్షలు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.డబల్ బెడ్ రూమ్ ఎంపికలో పారదర్శక పాటిస్తూ ఎంపిక చేసామని ఆయన తెలిపారు.ఎలాంటి అవినీతికి తావు లేకుండా చూస్తామని ఆయన అన్నారు.గత కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ ఇళ్ల పేరుతో అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆయన అన్నారు.కొంతమందికి ఇండ్లు కట్టలేదు బిల్లులు ఎత్తారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అవినీతికి తావు లేకుండా ఇల్లను పంపిణీ చేసిందని తెలిపారు.కోదాడ పట్టణం అందిస్తున్న ఒక్కొక్క ఇల్లు ఖరీదు 30 లక్షలు ఉంటుందని ఆయన అన్నారు.పేదలందరూ ఆత్మగౌరవంతో బతకాలని ఎంతో సహాయతమైన నిర్ణయంతో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లులు అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కి,బిఆర్ఎస్ ప్రభుత్వానికి, మీ బిడ్డగా నాకు నిండు ఆశీర్వాదం అందించాలని కోరారు.మాకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అందించిన ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కు జీవితాంతం రుణపడి ఉంటామని లబ్ధిదారులు వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, అన్నిస్థాయిల అధికారులు,బిఆర్ఎస్ పార్టీ నాయకులు,కౌన్సిలర్లు,ఇన్చార్జులు తదితరులు పాల్గొన్నారు.
కోదాడ పట్టణం బాలాజీ నగర్ లో 32 కోట్ల 24 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన 560 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
RELATED ARTICLES