కోదాడ,అక్టోబర్ 05(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కోదాడ పట్టణాని సర్వాంగ సుందరంగా మారుస్తా అని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.గురువారం కోదాడ పట్టణంలోని 35,14,18 వార్డులో కోట్ల రూపాయలతో చేపడుతున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ శంకుస్థాపన చేశారు.అనంతరం 100kv ట్రాన్స్ ఫార్మర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. గ్రామాల,పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది అని ఆయన అన్నారు.పట్టణాల్లో,గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తా అని ఆయన తెలిపారు.రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అందజేస్తున్న రైతు బంధు, రైతు బీమా,24 గంటల ఉచిత విద్యుత్ పథకాల గురించి గ్రామస్తులకు అవగాహన కల్పించాలని కోరారు.పేదింటి అడబిడ్డల పెండ్లి కోసం కల్యాలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల ద్వారా ప్రభుత్వం రూ.1,00,116 ఆర్ధిక సాయం అందజేస్తున్నదని అన్నారు.ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను పెంచేందుకు కేసీఆర్ కిట్స్ అందజేస్తున్నదని అన్నారు.ప్రతీ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపర్చి మౌళికవసతుల కల్పనకు పెద్దపీట వేస్తోందని అన్నారు.నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్ధిక సాయం అందిస్తున్నదని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,వార్డు కౌన్సిలర్లు,బిఆర్ఎస్ పార్టీ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.
కోదాడ పట్టణాని సర్వాంగ సుందరంగా మారుస్తా:గ్రామాల,పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి:ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్.
RELATED ARTICLES



