కోదాడ,ఫిబ్రవరి 26(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:స్థానిక పిఎసిఎస్ చైర్మన్ ఆవుల రామారావుపై ఇటీవల పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో కోర్టు స్టే అనంతరం నూతన చైర్మన్ గా సోమవారం కోదాడ మండల పరిధిలోని గుడిబండ గ్రామానికి చెందిన ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి నేడు బాధ్యతలు స్వీకరించారు.సోమవారం కోదాడ పిఎసిఎస్ కార్యాలయంలో సూర్యాపేట డిఎస్ఓ పద్మ మొత్తం 12 మంది డైరెక్టర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సంఘ సభ్యులందరి ఆమోదంతో శ్రీనివాస్ రెడ్డిని చైర్మన్ గా నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా డైరెక్టర్లు,కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతుల సంక్షేమానికి కృషి చేస్తూ సంఘ అభివృద్ధికి తోడ్పడాలని చైర్మన్ శ్రీనివాస్ రెడ్డిని అభినందిస్తూ ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిజిస్టర్లు ఇందిరా,పద్మజా,రవికుమార్,వైస్ చైర్మన్ బుడిగం నరేష్,మాజీ డిసిసిబి చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు,కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వంగవీటి రామారావు,మండల అధ్యక్షులు వరప్రసాద్ రెడ్డి,అవుదొడ్డి ధనమూర్తి,డైరెక్టర్లు శిరం శెట్టి వెంకటేశ్వర్లు,పార్వతి,కమతం వెంకటయ్య,ప్రభాకర్ రావు,గుజ్జ బాబు,గోబ్రా,శెట్టి శ్రీనివాసరావు,చంద్రమౌళి,సీతారామయ్య,రమాదేవి,నలజాల శ్రీనివాసరావు,సీఈఓ మంద వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.



