కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవం.
:స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు స్ఫూర్తిదాయకం:ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ దశరథ.
Mbmtelugunews//కోదాడ,ఆగష్టు 15 ప్రతినిధి మాతంగి సురేష్:దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను అర్పించిన మహనీయుల త్యాగం చిరస్మరణీయమని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ దశరథ అన్నారు.78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆసుపత్రి ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు.నాడు మహనీయుల త్యాగాల ఫలితంగానే నేడు స్వేచ్ఛగా జీవిస్తున్నామని వారి ఆశయాల సాధన కొరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు.అనంతరం ఆసుపత్రి సిబ్బందికి స్వీట్లు పంపిణీ చేసి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్స్ ఉష,వెంకటమ్మ,స్రవంతి,శంకర్,రమేష్ ఆసుపత్రి సిబ్బంది ఇతరులు పాల్గొన్నారు.