Sunday, March 22, 2026
[t4b-ticker]

కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలలో విజయవంతంగా కుక్కకి వెన్నెముక సర్జరీ

కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలలో విజయవంతంగా కుక్కకి వెన్నెముక సర్జరీ

:అభినందించిన పశువైద్య మరియు పశుసంవర్డక శాఖ, రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ డా,బియస్ రాయుడు

Mbmtelugunews//కోదాడ, మార్చి 22(ప్రతినిధి మాతంగి సురేష్): ఆర్తోపెడిక్ సర్జరీ అంటేనే క్లిష్టమైనది, అందులోనూ విరిగిన వెన్నెముక సర్జరీ మరింత సంక్లిష్టం
నోరులేని మూగజీవానికి విరిగిన వెన్నెముక అతికించడానికి సర్జరీ అంటే ప్రత్యేకమైన అరుదైన విషయం అని చెప్పాల్సిందే. కుక్కకు వెన్నుముక సర్జరీకి స్థానిక అసిస్టెంట్ డైరెక్టర్ డా,పి పెంటయ్య స్థానిక అర్తోపెడిక్ సర్జన్ డా, చంద్రమోహన్ సర్జరీలో పాల్గొన్నారు. ఈ ఆపరేషన్ కు కావలసిన పరికరాలను హైదరాబాద్ నుండి పంపించిన మిత్రుడు డా, మేళ్ళచెర్వు కిరణ్, శ్రీ పి వి నరసింహారావు, పశువైద్య విశ్వవిద్యాలయం, హైదరాబాద్ సర్జరీ విభాగం అధిపతి డా, రాధాకృష్ణ, గన్నవరం పశువైద్యకళాశాల ప్రోఫెషర్ డా, రవి, సాంకేతిక సహకారం, మరో స్థానిక అర్తోపెడిక్ సర్జన్ డా, జనార్ధన్, రిటైర్డ్ సర్జన్స్ సలహాలు ఇలా నిపుణుల సహకారంతో క్లిష్టమైన కుక్క వెన్నెముక సర్జరీ కోదాడలో విజయవంతంగా నిర్వహించిన విషయం తెలుసుకున్న పశువైద్య మరియు పశుసంవర్డక శాఖ తెలంగాణ రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ డా, బియస్ రాయుడు ప్రత్యేకంగా ఫోన్ చేసి అసిస్టెంట్ డైరెక్టర్ డా, పి పెంటయ్యని అభినందిస్తూ అర్తోపెడిక్ సర్జన్ డా. చంద్రమోహన్ సహకారం వెలకట్టలేనిదని ప్రశంసించడం మరో ప్రత్యేకమైన విశేషం అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్త్రం, ఎన్టీఆర్ జిల్లా నందిగామ కు చెందిన శామ్యూల్ అనే జంతు ప్రేమికుడి పెంపుడు కుక్కకి మోటారు బైక్ తగిలి నడుము విరిగి వెనుక కాళ్ళు చచ్చుపడిపోయి నడవలేని స్థితిలోకి వెళ్ళింది. తెలిసిన వారి ద్వారా కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలలో మెరుగైన చికిత్స అందిస్తారని తెలుసుకొని కుక్కని కోదాడ తీసుకు వచ్చారు. కుక్కను పరీక్షించిన డా, పి పెంటయ్య నడుముకి దెబ్బ గట్టిగా తలడంతో వెన్నుపూసలోని ఎముకలు విరిగినట్లు గుర్తించారు. వెన్నెముక దెబ్బతినడం వలన వెనుక కాళ్ళకు సరఫరా ఉన్న నరాలు చచ్చుబడి స్పర్శ తగ్గడం తో కాళ్ళు లేవలేకపోవడం గుర్తించారు.

అత్యంత క్లిష్టమైన వెన్నెముక సర్జరీ మాత్రమే కుక్కకి ఉపశమనం ఇస్తుందని అది కూడా ఎంతవరకు విజయవంతం అవుతుందో చెప్పలేమని తెలిపారు. రెండు రాష్ట్రాలలోని పశువైద్య యునివర్సిటీ సర్జరీ విభాగాల లో సలహాలు అడిగినా అందరూ అదే సమాదానం చెప్పారు. హైదరాబాద్ ప్రైవేట్ పశువైద్యశాలకి వెళ్తే లక్షల్లో ఖర్చు అవుతుందన్నారు. ఇవన్నే విచారించిన యజమాని , ప్రేమతో పెంచుకున్న పెంపుడు జంతువు బాధను చూడలేక తన కుక్కకి ఇక్కడే శస్త్ర చికిత్స చేయాలని పట్టుబట్టడంతో అసిస్టెంట్ డైరెక్టర్ డా,పి పెంటయ్య సర్జరీ పనిముట్ల సేకరణ చేసి స్థానిక అర్తోపెడిక్ సర్జన్ ల సహకారంతో కుక్క వెన్నుముక సర్జరీ నిర్వహించారు. విరిగిన వెన్నెముకను కదలకుండా అతికించి విజయవంతంగా శస్త్ర చికిత్స ముగించారు.ఈశస్త్ర చికిత్స లో కట్టకోమ్ముగుడెం పశువైద్యాదికారి డా, బి శ్రీనివాస్, సిబ్బంది రాజు, చంద్రకళ, రాజేష్ లు పాల్గొనారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular