కోదాడ బస్ డిపోలో భద్రాచలం కళ్యాణ తలంబ్రాల బుకింగ్
Mbmtelugunews//కోదాడ,మార్చి 17(ప్రతినిధి మాతంగి సురేష్):టీజీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్స్ ఆధ్వర్యంలో భద్రాచల రాముల వారి కళ్యాణ ముత్యాల తలంబ్రాల బుకింగ్ కార్యక్రమాన్ని కోదాడ డిపో మేనేజర్ హర్ష ప్రారంభించడం జరిగినది. ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ కేవలం 151 రూపాయలు పెట్టి బుక్ చేసుకున్నట్లయితే ముత్యాల తలంబ్రాలు ఇంటికి చేరుస్తామని,ఇట్టి అవకాశాన్ని భక్తులందరూ వినియోగించుకొని భద్రాద్రి సీతారాముల వారి ఆశీస్సులు పొందాలని కోరడం జరిగినది.బుకింగ్ కొరకు ఆర్టీసీ కార్గో కౌంటర్లలోనూ,ఆర్టీసీ ఉద్యోగులను సంప్రదించవచ్చని తెలియపరిచారు.మరిన్ని వివరములకు
సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు
9154298696
9502139957 కు సంప్రదించగలరు.ఈ కార్యక్రమం లో డిప్యూటీ సూపరింటేండెంట్ బి బి వెంకటేశ్వర్లు,సీనియర్ అసిస్టెంట్ భవాని,డిప్యూటీ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.