కోదాడ బాప్టిస్ట్ చర్చి ఆధ్వర్యములో జేవీఎస్ వీధిలో జగ్గునాయక్ నివాసంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
Mbmtelugunews/)కోదాడ,డిసెంబర్ 14(ప్రతినిధి మాతంగి సురేష్)స్థానిక జేవిఎస్ గల్లీలో పాస్టర్ యేసయ్య ఆధ్వర్యంలో జరిగిన సెమీ క్రిస్మస్ ఆరాధనలో క్రీస్తు నిజమైన వెలుగుగా ఈలోకానికి వచ్చాడని నిజమైన స్నేహితుడుగా ఉన్నాడని కొనియాడారు.ఈ కార్యక్రమానికి సూర్యాపేటజిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు ముఖ్యఅతిథిగా పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసి కేక్ కట్ చేశారు.వచ్చిన భక్తులందరికీ మాస్టర్ బానోతు జగ్గు నాయక్ ఆతిథ్యమిచ్చి గౌరవించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్
క్రిస్టియన్ కో ఆప్షన్ సభ్యులు వంటెపాక జానకి యేసయ్య,సీనియర్ కాంగ్రెస్ నాయకులు సైదానాయక్,హెడ్ కానిస్టేబుల్ జాన్,విజయానంద్,తబిత,రాణి,మోహన్,సీత,ప్రేమిల తదితరులు పాల్గొన్నారు.