Sunday, February 8, 2026
[t4b-ticker]

కోదాడ బాలాజీనగర్ కాలనీకి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కు నిధులు మంజూరు చేయాలని మాజీ సర్పంచ్ యెర్నేని మంత్రుల కు విజ్ఞప్తి

కోదాడ బాలాజీనగర్ కాలనీకి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కు నిధులు మంజూరు చేయాలని మాజీ సర్పంచ్ యెర్నేని మంత్రుల కు విజ్ఞప్తి

Mbmtelugunews//హుజూర్ నగర్, జనవరి 07(ప్రతినిధి మాతంగి సురేష్): హుజూర్ నగర్ లో మంత్రులకు స్వాగతం పలికిన మాజీ సర్పంచ్ యెర్నేని హుజూర్‌నగర్‌లో బుధవారం రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల కాలనీతో పాటు నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా చేపట్టిన పనుల పురోగతి, ప్రజలకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మంత్రుల పర్యటన సందర్భంగా కోదాడ మాజీ సర్పంచ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎర్నేని వెంకటరత్నం బాబు పుష్పగుచ్చాలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా కోదాడ పట్టణంలోని బాలాజీనగర్ లో డబుల్ బెడ్ రూం ఇళ్ల కాలనీ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేసి రహదారులు, డ్రైనేజీ, తాగునీటి వంటి మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని మంత్రులను కోరారు. కోదాడ లో డబుల్ బెడ్ రూం ఇళ్లు పూర్తి చేయాలని ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అన్ని కాలనీల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular