Mbmtelugunews//కోదాడ,మే 27 (ప్రతినిధి మాతంగి సురేష్)కోదాడ మార్కెట్ యార్డ్ అభివృద్ధి కి కొత్త ఆలోచనలు కొత్త టెక్నాలజీలతో సంబంధిత మార్కెటింగ్ అధికారులు తగిన ప్రణాళికలు రూపొందించాలని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి సూచించారు. మంగళవారం కోదాడ వ్యవసాయ మార్కెట్ యాడ్ ను ఎమ్మెల్యే ఉత్తం పద్మావతి పరిశీలించారు.అనంతరం మార్కెట్ అభివృద్ధి పై మార్కెటింగ్ శాఖ అధికారులు, పాలకవర్గం సభ్యుల తో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎం ఎల్ ఏ మాట్లాడుతూ మార్కెట్ కమిటీ కి పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా సహకారం అందించనున్నట్లు తెలిపారు.మార్కెటింగ్ శాఖ అధికారులు భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.అమ్మకదారులు కొనుగోలుదారులు సంతలోనే వ్యాపారాలు చేసుకోవాలని మార్కెట్ అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు.ఈ సమావేశంలో కోదాడ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్,వైస్ ఛైర్మన్ బషీర్,మార్కెటింగ్ శాఖ సంచాలకులు లక్ష్మీబాయి,జేడీమ్ శ్రీనివాస్,ఎస్ఈ లక్ష్మణ్,డిఈఈ రవీందర్,డిస్ట్రిక్ట్ ఆఫీసర్ శర్మ,,సెలక్షన్ గ్రేడ్ సెక్రెటరీ రాహుల్,సిహెచ్ సూర్యం,వీరబాబు,వెంకటరెడ్డి,వెంకటేశ్వర్లు,నాగవేను,మణెమ్మ,శ్రీను,శ్రీనివాస్,కోటయ్య,అమర్ సింగ్,నర్సిరెడ్డి తదితరులు