కోదాడ మార్కెట్ కార్యాలయంలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి జన్మదిన వేడుకలు.
Mbmtelugunews//కోదాడ,జూన్ 18(ప్రతినిధి మాతంగి సురేష్):మంగళవారం కోదాడ నియోజకవర్గ శాసనసభ్యురాలు పద్మావతి రెడ్డి జన్మదిన వేడుకలు సందర్భంగా మార్కెట్ కార్యాలయంలో
వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా చైర్ పర్సన్ తిరుపతమ్మ మాట్లాడుతూ నీతి నిజాయితీగా అవినీతి లేకుండా 30 సంవత్సరాల నుండి కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలే వారి కుటుంబ సభ్యులుగా భావించి రెండు నియోజకవర్గాలను అభివృద్ధి పథంలో నడుపుతున్న ఘనత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి దేనని అన్నారు.కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చి తాగునీరు,సాగునీరు,రోడ్లు,గ్రామాలలో మౌలిక సౌకర్యాలు,ప్రభుత్వ కార్యాలయం ఏర్పాటు,ఇందిరమ్మ ఇల్లు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ అనునిత్యం ప్రజల కోసం పనిచేస్తున్నారన్నారు గత పాలన లో దోపిడీ బెదిరింపులు రాజకీయాలు చేశారని ఇప్పుడు ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి వచ్చిన తర్వాత కోదాడ నియోజకవర్గ ప్రజలు ప్రశాంతంగా వ్యాపారలు ఉద్యోగాలు చేసుకుంటూ ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు నివసిస్తున్నారన్నారు.ఈ కార్యక్రమంలో నెంబర్లు మల్లు వెంకటరెడ్డి,మనెమ్మ,శ్రీను,శ్రీనివాస్,వెంకటేశ్వర్లు,సూర్యం సిబ్బంది తదితరులు ఉన్నారు.