కోదాడ మున్సిపాలిటీ పరిధిలో ప్రారంభమైన 21 వ అఖిలభారత పశుగణన కార్యక్రమం
Mbmtelugunews//కోదాడ నవంబర్ 15(ప్రతినిధి మాతంగి సురేష్)దేశంలో సంక్షేమ పథకాల రూపకల్పన,పశుపోషకుల ఆర్ధిక బలోపేతానికి ప్రతీ అయిదు సంవత్సరాలకి ఒక మారు దేశవ్యాప్తంగా ఏకకాలంలో నిర్వహించే అఖిల భారత పశుగణన కార్యక్రమాన్ని కోదాడ మున్సిపాలిటీ పరిధిలో ప్రారంభించిన ప్రాంతీయ పశువైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డా,, పి పెంటయ్య.అనంతరం అయన మాట్లాడుతూ కోదాడ మున్సిపాలిటీ పశుపోషకుల వద్ద ఉన్నటువంటి వాస్తవ పశువుల సంఖ్యను గణించడానికి ఈరోజు నుండి ఫిబ్రవరి మాసం వరకు ఇంటింటికీ పశువుల లెక్కింపు సర్వే నిర్వహిస్తున్నామని,ఆవులు,గేదెలు,గొర్రెలు,మేకలు,కోళ్లు,కుక్కలు,పందులు,కుందేళ్లు,గుర్రాలు మొదలగు మొత్తం 16 జాతులకు సంబంధించిన పశువుల లెక్కను పక్కాగా సేకరించడం జరుగుతుంది అని తెలిపారు.పేపరు తో సంబంధం లేకుండా భారత్ పశుదాన్ పోర్టల్లో చరవాణి ద్వారా ఎన్యుమారేటర్లు ఇంటింటికి తిరిగి కంటితో పశువుల్ని చూసి లెక్కలను అంతర్జాలంలో అప్లోడ్ చేస్తారు.ఎన్యుమారేటర్లకి పలు దఫాలుగా శిక్షణ ఇచ్చి,ఒక్కో ఎన్యుమారేటర్ కి ఒక ఐడి ఇవ్వడం ద్వారా సర్వేలో ఇతరులు ఎలాంటి వివరాలు నమోదు చేసే అవకాశం లేకుండా పకడ్బందీగా పశువుల లెక్కలు తీయడం జరుగుతుందని తెలిపారు.ముఖ్యంగా ఈ మధ్య కాలంలో తరచుగా వార్తల్లో నిలిచే కుక్కకాటు ప్రమాదాల్ని భవిష్యత్ లో నివారించడానికి ఈ సర్వే ద్వారా మున్సిపాలిటీలో యజమానులు పెంచే కుక్కలు వీది కుక్కల వివరాలను సేకరించి వాటికి టీకాలు సరియైన యాజమాన్యంతో కుక్కకాటు ప్రమాదాలను నివారించడానికి అలాగే రోడ్లపై ప్రమాదాలకు కారణమయ్యే వీది పశువుల లెక్కలు సైతం విడివిడిగా సేకరిస్తున్నందున ఇంటి యజమానులు షాప్ ల యజమానులు తమ పశువులు కుక్కలు ఇతర పెంపుడు జంతువులతో పాటు వీది పశువులు కుక్కల వివరాలు సైతం అందివ్వాలని ఎన్యుమారేటర్లకి సహకరించాలని కోరారు.సర్వే చేసే సిబ్బంది ఉదయం సాయంత్రం వేళల్లో ప్రజలు ఇంటివద్ద ఉన్నప్పుడు సర్వే నివసించాలని ఈరోజు ప్రగతి అదేరోజు సమీక్షించడం జరుగుతుందని సర్వేలో అలసత్వంలేకుండా అత్యంత వాస్తవిక పశుగణన చెయ్యాలని తద్వారా రాబోయే అయిదు సంవత్సరాల సంక్షేమ పథకాల రూపకల్పనకు సహకరించాలని సూచించారు.సర్వే నిర్వహించే ఒక్కో ఎన్యూమరేటర్ కి నెలకి 1000 చొప్పున నాలుగు నెలలకి 4000 ఇండ్లు,ప్రతీ నెలకి చరవాణి వాడకానికి 1000 రూపాయలు,బ్యాటరీ పవర్ బ్యాంకు కి 1500 పశువులు ఉన్నా లేకున్నా సర్వే చేసిన ఇంటికి ఒక్కంటికి రూపాయలు 8.15 /-చెల్లించబడునని అలా ఒక్క ఎన్యుమారేటర్కి సర్వే చేసినందులకు మొత్తం రూపాయలు చెల్లించబడునని పట్టణంలో చదువుకొని కాళీగా ఉండే యువకులు ఎవరైనా పశుగణ నిర్వహించడానికి ఆసక్తి ఉంటే ప్రాంతీయ పశువైద్యశాలలో సంప్రదించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ వెంట కోదాడ మండల పశువైద్యాధికారి డా మధు,అరుణ జేవివో,సిబ్బంది ప్రశాంత్,కంపాటి చంద్రకళ,సాగర్ తదితరులు పాల్గొన్నారు.