కోదాడ యూనిట్ కార్యాలయం గుడిబండకు త్వరలో మార్పు
Mbmtelugunews//కోదాడ, జనవరి 22(ప్రతినిధి మాతంగి సురేష్): కోదాడ రవాణా శాఖ యూనిట్ కార్యాలయాన్ని గుడిబండలో కేటాయించిన 2 ఎకరాల నూతన స్థలానికి తరలించనున్నట్లు మోటార్ వాహన తనిఖీ అధికారి జిలానీ షేక్ వెల్లడించారు. ఈ స్థలాన్ని సూర్యపేట జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, కొదాడ డివిజన్ ఆర్డీవో, ఎమ్మార్వో సమన్వయంతో రవాణా శాఖకు కేటాయించినట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఇన్‌చార్జ్ జిల్లా రవాణా అధికారి ఎస్. జయప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు గుడిబండలోని నూతనంగా కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. కొదాడ మోటార్ వాహన తనిఖీ అధికారి జిలానీ షేక్ నూతన యూనిట్ కార్యాలయానికి కేటాయించిన భూమి వివరాలను వివరించి, స్థలాన్ని అధికారులకు చూపించారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించేందుకు ఈ స్థలం అనుకూలంగా ఉందని ఆయన తెలిపారు.ప్రస్తుతం తమ్మర లో కొనసాగుతున్న కోదాడ రవాణా శాఖ యూనిట్ కార్యాలయం త్వరలోనే గుడిబండకు పూర్తిగా మారనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ మార్పుతో కొదాడ ప్రజలకు రవాణా సేవలు మరింత సులభంగా, సమర్థవంతంగా అందనున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మోటార్ వాహన తనిఖీ అధికారులు రాజా మొహమ్మద్, కె శ్రీనివాసులు, అసిస్టెంట్ మోటార్ వాహన తనిఖీ అధికారులు సంపత్ గౌడ్, జిఆర్ చరణ్ పాల్గొన్నారు.



