కోదాడ,జులై 28(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:కోదాడ నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో నీలి జెండా ఎగరేస్తామని ఆ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ వెంకటేష్ చౌహన్ ధీమా వ్యక్తం చేశారు.శుక్రవారం కోదాడ పట్టణంలోని ఖమ్మం రోడ్లో బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించి అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.బహుజనులకు రాజ్యాధికారం కోసం పోరాడుతున్నా ఏకైక పార్టీ బిఎస్పీ అన్నారు.70 సీట్లు బీసీలకు కేటాయించిన ఏకైక పార్టీ బీఎస్పీ ఒకటే అన్నారు. దమ్ముంటే బీసీలకు ఇచ్చే సీట్లను ప్రకటించాలని బిఆర్ఎస్ పార్టీకి సవాల్ విసిరారు. బహుజనుల ఓట్ల తో కోదాడ నియోజకవర్గంలో గతంలో వెలమదొరలు తర్వాత రెడ్డి దొర లు అధికారాన్ని ఏలారన్నారు. ప్రస్తుతం జరగబోయే ఎన్నికలకు కోదాడ నియోజకవర్గానికి తమ పార్టీ అభ్యర్థి గా రజాకర్లపై విరోచితంగా పోరాడిన చాకలి ఐలమ్మ వారసునిగా పిల్లుట్ల శ్రీనివాస్ ను ఎంపిక చేసామన్నారు. కోదాడ రాజకీయాలు గందరగోళంగా ఉన్నాయని బహుజనులు అంతా ఏకమై పిల్లుట్ల శ్రీనివాస్ ను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. కోదాడ నియోజకవర్గంలో గతంలో రాష్ట్ర అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ పాదయాత్ర చేసినట్లు చేస్తామన్నారు. కోదాడ నియోజకవర్గంలో పార్టీ జాతీయ అధ్యక్షురాలు బేహాన్ జీ మాయావతి, రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రత్యేక దృష్టి సారించారని పేర్కొన్నారు. మూడు నెలలు ముందుగానే ప్రత్యేక కార్యాచరణను చేపడతామన్నారు. కోదాడలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.పార్టీ కార్యక్రమాలన్నీ పార్టీ కార్యాలయ కేంద్రంగానే నిర్వహించబడతాయన్నారు. కోదాడలో తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యం కోసం ఐక్యంగా ఉద్యమిద్దామన్నారు.ఈ సమావేశంలో కోదాడ నియోజకవర్గ ఇన్చార్జి పిల్లుట్ల శ్రీనివాస్,బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి,కోదాడ స్పెషల్ ఇంఛార్జి గుండెల ధర్మేందర్,రాష్ట్ర కమిటీ సభ్యులు,జిల్లా ఇంఛార్జి రాపోలు నవీన్,జిల్లా అధ్యక్షుడు బుడిగం మల్లేష్ యాదవ్,ఉపాధ్యక్షుడు పిడమర్తి దశరథ,జిల్లా కార్యదర్శి సాలె రామారావు,జిల్లా కమిటీ సభ్యులు మాతంగి ఏసుబాబు,నియోజకవర్గ అద్యక్షుడు కుంభంపాటి శ్రావణ్ కుమార్,నియోజకవర్గ ఉపాధ్యక్షుడు చింతల రమేష్,ప్రధాన కార్యదర్శి యరసానీ కృష్ణ యాదవ్,నియోజక సోషల్ మీడియా మహిళ కన్వీనర్ షేక్ షర్మిల,కార్యదర్శి కాంపాటి వీరాస్వామి,చిన్నం ఇర్మియ,కోదాడ మండల అధ్యక్షుడు మెరే ఎల్లయ్య,మండల అధ్యక్షులు,గ్రామ అధ్యక్షులు,కార్యదర్శులు నాయకులు,కార్యకర్తలు అభిమానులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
కోదాడ లో బిఎస్పీ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం లో బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ వెంకటేష్ చౌహన్
RELATED ARTICLES