కోల్ కత్తా ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలి…
:ప్రెస్ క్లబ్ జిల్లా అధ్యక్షులు కారింగుల అంజన్ గౌడ్…
:ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడియా గాఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ….
Mbmtelugunews//కోదాడ,ఆగష్టు 21:కలకత్తాలో జూనియర్ డాక్టర్ పై,హత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ప్రెస్ క్లబ్ జిల్లా అధ్యక్షులు కారింగుల అంజన్ గౌడ్ పేర్కొన్నారు. ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంల బుధవారం సాయంత్రం బస్టాండ్ ఆవరణలోని గాంధీ విగ్రహం నుండి కూరగాయల మార్కెట్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వరకు కొవ్వొత్తులతో జర్నలిస్టులు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు.అనంతరం
ప్రెస్ క్లబ్ జిల్లా అధ్యక్షులు అంజన్ గౌడ్ మాట్లాడుతూ కోల్ కత్తా లో మహిళా డాక్టర్ పై అఘాయిత్యానికి పాల్పడిన బాధ్యులను కఠినంగా వెంటనే శిక్షించాలని అన్నారు.డాక్టర్లు దేవుళ్ళతో సమానమని అన్న పదాన్ని మరచి పోయి ఒక వైద్యురాలు పై సభ్య సమాజం తలదించుకునేలా దాడి చేసి అతి క్రూరంగా అత్యాచారం చేయడం చాలా విషాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు.అనంతరం మహిళా డాక్టర్ చిత్రపటానికి నివాళులర్పించారు.ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో హరికిషన్ రావు,శ్రీనివాసరావు,రాంబాబు,ఎం లక్ష్మణ్,పూర్ణచంద్రరావు,శ్రీకాంత్,నజీర్,టి నాగరాజు,వెంకట్ నారాయణ,సురేష్,టి లక్ష్మణ్,సైదులు,రామారావు,గోపాల్,లింగయ్య,నరేష్,గోపి,నాగరాజు,శ్రీహరి,రామకృష్ణ,సత్యనారాయణసునీలు,కిట్టు,మజ్జుకర్ మజహార్ భారీ సంఖ్యలో నియోజకవర్గ జర్నలిస్టు లు పాల్గొన్నారు.