Tuesday, December 23, 2025
[t4b-ticker]

కోళ్లు కాళ్ల ఆనెలకు శస్త్ర చికిత్సల కోసం ప్రాంతీయ పశువైద్యశాలకు జాతికోళ్ల పెంపకం దారులు

కోళ్లు కాళ్ల ఆనెలకు శస్త్ర చికిత్సల కోసం ప్రాంతీయ పశువైద్యశాలకు జాతికోళ్ల పెంపకం దారులు

Mbmtelugunews//కోదాడ, డిసెంబర్ 04(ప్రతినిధి మాతంగి సురేష్): ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అత్యంత ప్రత్యేకం. వాటి విక్రయంతో అధిక రాబడికి అవకాశం ఉండడంతో చాలా మంది,మక్కువతో పలురకాల పందెం జాతి కోళ్లను సాకుతూ సంక్రాంతి సీజన్లో వాటిని విక్రయించడం ద్వారా మంచి ఆదాయం పొందుతున్నారు. సంక్రాంతి సంబరాలకు సమయం సమీపిస్తుండడంతో, తాము పెంచే జాతి కోళ్లు ఎలాంటి లోపాలు లేకుండా పూర్తి ఆరోగ్యం, దృఢంగా ఉండాలనే తపనతో చిన్న చిన్న లోపాలున్న కోళ్లకి శస్త్ర చికిత్సల ద్వారా వాటి పటుత్వాన్ని మెరుగుపరిచి అధిక లాభాలు పొందడానికి పెంపకందారులు కోళ్లను తీసుకొని కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలకు వస్తున్నారు. కాళ్లు రెక్కలు విరిగితే గతంలో ఇంట్లో వండుకోని తినేవారు, కానీ నేడు వాటిమీద ఉన్న మోజుతో విరిగిన కాలు రెక్కలకు రాడ్స్ వేయించి అయినా చికిత్స చేయిస్తూ జాతికోళ్ల పై మోజును పెంచుకుంటున్నారు.పట్టణం లోని కోళ్ల పెంపకందారు ఒకరు తన వద్ద ఉన్న జాతి కోడి పుంజు రెండు కాళ్లకి ఆనెలు పెరగడంతో నిలబడటం నడవడంలో ఇబ్బందిగా మారడంతో చికిత్స నిమిత్తం ప్రాంతీయ పశువైద్యశాలకి తీసుకు వచ్చారు. పరీక్షించిన అసిస్టెంట్ డైరెక్టర్ డా పి పెంటయ్య , శస్త్రచికిత్స ద్వారా పెరిగిన ఆనెలను తొలగించి కోడిపుంజుకి పూర్వపు జవసత్వాలను అందించారు .కోదాడ పందెం కోళ్ల పెంపకం దారులే కాకుండా నడిగూడెం, కట్టకొమ్ముగూడెం,సింగారం తదితర పరిసర ప్రాంతాలనుండి కోడి పుంజులను తీసుకు వచ్చి ముదురు కోళ్ల కాళ్ళలో పెరిగిన ఆనెలను శస్త్ర చికిత్సల ద్వారా తొలగించుకుంటున్నారు. జంతు సంక్షేమ చట్టాల ప్రకారం జంతువు ఏదైనా , చివరకు అది మానవాళి ఆహారం కోసం పెంచినదైనా అది బ్రతికి ఉన్నంతవరకు ఎలాంటి హాని తలపెట్టకుండా సకల సౌకర్యాలతో తోటి ప్రాణి లాగానే చూడాలి అని అసిస్టెంట్ డైరెక్టర్ డా పి పెంటయ్య అన్నారు.
శస్త్రచికిత్సలో సిబ్బంది రాజు , చంద్రకళ, అఖిల్, హరికృష్ణ పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular