క్యూబాకు అండగా నిలబడతాం….
:ఆదేశ ప్రజానీకానికి ఆర్థిక తోడ్పాటు అందిస్తాం…
:సిపిఎం ఆధ్వర్యంలో క్యూబా సంఘీభావనిది వసూళ్లు…
Mbmtelugunews//సూర్యాపేట, జూన్ 06(ప్రతినిధి పల్లెల రాము):క్యూబా పై అమెరికా ఆంక్షలు విధించడం మూలంగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని వారి ఆదుకునేందుకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో క్యూబా సంఘీభావ నిధి వసులు చేస్తున్నామని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా మోతే మండల పరిధిలోని సిరికొండ గ్రామంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో క్యూబా సంఘీభావ నిధి వసూలు చేశారు.ఈ సందర్భంగా ఆనిధిని సూర్యాపేట జిల్లా కేంద్రంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి కి అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యూబా పై అమెరికా ఆంక్షలు అన్యాయమైనవి,అమాననీయమైనవి అన్నారు.ఈ ఆంక్షలు క్యూబా ప్రజల జీవితాన్ని తీవ్రంగా దెబ్బతిస్తున్నాయన్నారు. అగ్రరాజ్యం అమెరికా విధించిన ఆర్థిక, వాణిజ్య ఆంక్షలు వల్ల క్యూబా దేశం 65 ఏళ్ల నుండి నలిగిపోతుందన్నారు.అమెరికా ఆంక్షలు క్యూబా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి,ప్రజల జీవన ప్రమాణాలను తీవ్రంగా దెబ్బతీశాయన్నారు. అమెరికా యొక్క ఏకపక్ష ఆంక్షలు అనైతికమైనవి అని అన్నారు.అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించాయని ప్రపంచవ్యాప్తంగా అమెరికా చేస్తున్న దుర్మార్గాలను ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయన్నారు. అమెరికాకు 150 కిలోమీటర్లు దూరంలో ఉన్న కమ్యూనిస్టు దేశాన్ని లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతుందన్నారు.దీని ఫలితంగా క్యూబా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినడమే కాకుండా ఆహారం,ఔషధాలు,ఇందరం వంటి అత్యవసర వస్తువుల కొరత క్యూబా ప్రజల జీవనాన్ని దుర్భరం చేసిందన్నారు.ఈ ఆంక్షలు రద్దు చేయాలని దాదాపు ప్రతి సంవత్సరం ఐక్యరాజ్యసమితి తీర్మానాలు ఆమోదించినప్పటికీ అమెరికా వాటిని లెక్కచేయకుండా క్యూబా పై ఆంక్షలు విధిస్తూ వస్తుందన్నారు.క్యూబా ప్రజల ఆకాంక్షలు, వారి స్వాతంత్ర పోరాటం,మానవ హక్కుల గౌరవం కోసం వారు చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలియజేస్తూ క్యూబా ప్రజలకు ఆర్థిక సహాయం చేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యురాలు జంపాల స్వరాజ్యం,సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జిల్లా పల్లి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.