క్రమశిక్షణ,దాతృత్వం,ధార్మిక చింతన కలయికే రంజాన్…
•ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అంజన్ గౌడ్…
Mbmtelugunews//కోదాడ,మార్చి 31(ప్రతినిధి మాతంగి సురేష్):ఎంతో నిష్ఠతో.. భక్తి శ్రద్ధలతో ముస్లిం సోదరులు జరుపుకొనే పవిత్ర పండుగ రంజాన్ అని సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్ గౌడ్ అన్నారు.ఈ సందర్భంగా ముస్లిం మతస్తులకు, జిల్లా ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.అల్లాహ్ దీవెనలతో జిల్లా ప్రజలకు సుఖ,సంతోషాలు,సకల శుభాలు కలగాలని,ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.క్రమశిక్షణ, దాతృత్వం,ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం విశిష్టత అని ఆమె పేర్కొన్నారు.నెల రోజుల పాటు కఠోర దీక్షతో నిష్ఠగా అల్లాను ఆరాధిస్తూ అత్యంత క్రమ శిక్షణతో కూడిన ఆధ్యాత్మిక జీవనం కొనసాగిస్తారని గుర్తు చేశారు.అల్లా కరుణ,దయ,కృవతో ముస్లిం సోదర,సోదరీమణులు రక్షణ పొందాలని,కుటుంబ సభ్యులతో పాటు ఆనందాల నడుమ రంజాన్ పర్వదినాన్ని సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ వేళ అందరూ సోదరభావంతో మెలగాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.ఈ మేరకు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.