క్రికెట్లో రాణించి కోదాడకు పేరు తేవాలి….
:క్రీడల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట…
:గెలుపు ఓటములు సహజం క్రీడా స్ఫూర్తి ప్రధానం…..
:క్రీడాకారులకు మంత్రి ఉత్తమ్ ఎమ్మెల్యే పద్మావతిల తో సహకారం అందిస్తా….
:బాలాజీ నగర్ లో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన కోదాడ మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబు
Mbmtelugunews//కోదాడ, జనవరి 25(ప్రతినిధి మాతంగి సురేష్): కోదాడ క్రీడాకారులు క్రికెట్లో రాణించి కోదాడ పట్టణానికి పేరు ప్రఖ్యాతులు తేవాలని కోదాడ మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబు అన్నారు. ఆదివారం కోదాడ పట్టణ పరిధిలోని బాలాజీ నగర్ లో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడా రంగ అభివృద్ధి కి పెద్ద పీట వేస్తుందన్నారు.మంత్రి ఉత్తమ్ ఎమ్మెల్యే పద్మావతి ల సహకారం తో క్రీడా రంగ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజం అని క్రీడా స్పూర్తితో క్రీడలు నిర్వహించుకోవాలన్నారు. క్రీడలకు తన వంతు సహకారం అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రావెళ్ల కృష్ణా రావు, పిల్లుట్ల శ్రీనివాస్, కొట్యా నాయక్ స్థానిక నాయకులు, క్రీడా కారులు ఉన్నారు.



