క్రీడలకు ప్రభుత్వం తగిన ప్రాధాన్యతనిస్తుంది
:ఏఎంసి చైర్పర్సన్ తిరుపతమ్మ సుధీర్
Mbmtelugunews//కోదాడ,(నడిగూడెం) జనవరి 12(ప్రతినిధి మాతంగి సురేష్): క్రీడలు శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్ అన్నారు. బుధవారం నడిగూడెం మండల కేంద్రంలో కీర్తిశేషులు ఎలుగూరి వెంకటేశ్వర్లు యువసేన ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల స్థాయిలో నిర్వహిస్తున్న వాలీబాల్ పోటీలను సర్పంచులు బూత్కూరి వెంకటరెడ్డి, దున్నా శ్రీనివాస్, అట్టూరి పుష్ప నాగేందర్ రెడ్డి, గోసుల రాజేష్, ఎస్సై అజయ్ కుమార్ లతో కలసి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ క్రీడలను స్నేహపూర్వక వాతావరణంలో నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు. క్రీడా పోటీ నిర్వహించిన వై వి ఆర్ యువసేన సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా పోటీల ప్రారంభ కార్యక్రమానికి వచ్చిన అతిథులను, పీడీలను నిర్వాహకులు శాలువా, మెమంటాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లు ఎలుగూరి నాగరాజు, దోసపాటి రవి, వార్డు సభ్యులు దున్నా శ్రీకాంత్, గుండు మహీందర్ ప్రసాద్, కాసాని మాదవి గోపినాధ్, నాగవరపు సరస్వతి రాము, కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండు శ్రీనివాస్, గుండు చిన్న శ్రీను, కాసాని శివ లింగం, గుండు విజయరామారావు, పల్లపు శ్రీను, పాతకోట్ల రాము, శ్రీరాముల శ్రీను, మౌలాన, కాసాని
శివకృష్ణ, పీడీలు పేరెల్లి కోటి, పాతకోట్ల ప్రకాశ్, కలకొండ సృజన్, పాతకోట్ల నాగరాజు, ఉపాధ్యాయులు
మేరాజుద్దున్, ఇంతియాజ్, నిర్వాహకులు కిరణ్, సతీష్, శ్రీను, ఉపేందర్, గోపాల్, చారి, ఎల్లయ్య, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు…



