క్రీడలతో శారీరక దృఢత్వం మానసిక వికాసం
:గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయడానికి క్రీడా పోటీలు.
:నల్లబండగూడెంలో కబడ్డీ పోటీలు ప్రారంభించిన ఎస్సై అనిల్ రెడ్డి.
Mbmtelugunews//కోదాడ,ఫిబ్రవరి 14(ప్రతినిధి మాతంగి సురేష్):క్రీడలతో శారీరక దృఢత్వం మానసిక ఉల్లాసం కలుగుతాయని కోదాడ రూరల్ ఎస్సై అనిల్ రెడ్డి అన్నారు.శుక్రవారం కోదాడ మండలంలోని నల్లబండగూడెం లింగమంతుల జాతర సందర్భంగా స్థానిక యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు గ్రామీణ క్రీడాకారులలో ఉన్న ప్రతిభాను వెలికి తీయడానికి క్రీడా పోటీలు దోహదం చేస్తాయన్నారు.క్రీడాకారులు క్రీడాలలో రాణించి కోదాడకు పేరు ప్రఖ్యాతలు తేవాలన్నారు క్రీడలు నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు.క్రీడా స్ఫూర్తితో క్రీడాకారులు క్రీడలను విజయవంతం చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ యరమాల సుశీల బెంజిమెన్,మాజీ ఎంపీటీసీ యరమాల క్రాంతికుమార్,అలసగాని శరభయ్య,ముండ్ర రంగారావు,మేకల ప్రతాప్,ముండ్ర శివరామకృష్ణ ,మాజీఉపసర్పంచ్ కొల్లూరి రామారావు,నేలవెల్లి నారాయణరావు,బట్టు కోటేశ్వరావు,గోసు గోపీనాథ్,కలకొండ నాగేశ్వరరావు,యరమాల శ్రీను తదితరులు పాల్గొన్నారు.



