క్రీడల్లో గెలుపు ఓటములు సమానంగా తీసుకోవాలి
:క్రీడల్లో ఓటమి చెందిన క్రీడాకారులు సాధన చేసి తిరిగి విజేతలు గా నిలవాలి…
:సీసీఆర్ లో జాతీయ స్థాయి క్రీడలు నిర్వహించడం అభినందనీయం…
:జాతీయ స్థాయిలో క్రీడలు నిర్వహించి కోదాడ కు వన్నెతెచ్చిన సిసిఆర్ విద్యా నిలయం యాజమాన్యం అభినందనీయం…..
:క్రీడా విజేతలకు బహుమతుల పంపిణీలో కోదాడ ఎమ్మెల్యే పద్మావతి…
Mbmtelugunews//కోదాడ, నవంబర్ 28(ప్రతినిధి మాతంగి సురేష్): క్రీడల్లో ఓటమి చెందిన క్రీడాకారులు ఓటమికి కుంగి పోకుండా తిరిగి సాధన చేసి విజేతలుగా నిలవాలని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని సిసిఆర్ విద్యానిలయంలో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న 19వ సిఎస్ఏ జాతీయ స్థాయి క్రీడా పోటీల విజేతలకు బహుమతులు అందజేసి మాట్లాడారు. జాతీయ స్థాయి క్రీడలు నిర్వహించి సీసీఆర్ విద్యా నిలయం కోదాడ కు జాతీయ స్థాయిలో వన్నె తెచ్చిందని కొనియాడారు. సిసిఆర్ విద్యార్థులు విద్యతోపాటు క్రీడల్లో జాతీయస్థాయిలో రాణించడం అభినందనీయమన్నారు.

క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమని క్రీడా స్ఫూర్తి నీ కలిగి ఉండడమే ప్రదానం అన్నారు. వివిధ రాష్ట్రాల నుండి వందలాది మంది విద్యార్థులు స్పోర్ట్స్ మీట్ లో పాల్గొనడం అభినందనీయం అన్నారు. కాగా తమిళం మాట్లాడి తమిళనాడు రాష్టం క్రీడాకారులను ఉత్తేజ పరిచారు. క్రీడా కారులకు తన వంతు సహకారం అందిస్తన్నారు. విద్యా సంస్థలు విలువల తో కూడిన విద్యను అందించడం తో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. క్రీడలతో విలువలు, క్రమ శిక్షణ అలవడు తాయన్నారు. కాగా పాఠశాల యాజ మాన్యం ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. గత నాలుగు రోజులుగా హోరా హోరీ గా జరిగిన జాతీయ స్థాయి క్రీడలకు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర లనుండి 29పాఠశాల ల నుండి 1450మంది కబడ్డి, వాలీబాల్, హ్యాండ్ బాల్, త్రో బాల్, బాస్కెట్ బాల్, స్పోర్ట్స్ ఈవెంట్స్ లో ప్రాతినిధ్యం వహించారు. ప్రోవిన్షియల్ సుపీరియర్ ఉడుముల శౌరీలు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అసిస్టెంట్ సుపీరియర్ జనరల్ సిస్టర్ ఆల్ఫోన్సా, సిస్టర్ నక్షత్రం, సిస్టర్ శాంతా మేరీ, సిస్టర్ ఇరుదయం జూలియట్, సిస్టర్ విజయ ఫాదర్ ఫజోసాఫ్ రెడ్డి పాఠశాల హెచ్ఎం సిస్టర్ అన్ జ్యోతి, పిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు, ఎంఈఓ సలీం షరీఫ్, బాల్ రెడ్డి, సుందరి వెంకటేశ్వర్లు, దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు……



