క్రీడాకారులకు దుస్తుల పంపిణీ అభినందనీయం
Mbmtelugunews//కోదాడ, సెప్టెంబర్ 23(ప్రతినిధి మాతంగి సురేష్): 35వ సబ్ జూనియర్స్ బాలికలకు శ్రీ వైష్ణవి స్కూల్ క్రీడా దుస్తుల ప్రదానం
సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ వైష్ణవి స్కూల్ లో జరుగుతున్న సబ్ జూనియర్స్ బాల బాలికల కబడ్డీ కోచింగ్ క్యాంపు గత 5 రోజుల నుండి జరుగుతుంది. అందులో భాగంగా శ్రీ వైష్ణవి స్కూల్ డైరెక్టర్ లక్ష్మణ్ రావు బాలికలకు క్రీడా దుస్తులు అందించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి నామా నరసింహ రావు మాట్లాడుతూ క్రీడాకారులకు ఇంతటి అవకాశం కల్పించిన వైష్ణవి స్కూల్ వారికి, లక్ష్మణ్ రావు కి అసోసియేషన్ తరుపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో జిల్లా ఉపా అధ్యక్షులు రాంచంద్రయ్య, శ్రీనివాస్ రెడ్డి, సైదులు, మాతంగి ప్రభాకర్ రావు, క్రీడాకారులు ప్రదీప్, రమేష్ బాబు, కోటేశ్వరరావు, సత్యనారాయణ, ఉదయ్ పాల్గొన్నారు.



