క్రీడా నైపుణ్యాల అభివృద్ధికి సమ్మర్ కోచింగ్ క్యాంపులు
:సమ్మర్ కోచింగ్ క్యాంపులను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలి.
Mbmtelugunews//కోదాడ,మే 01(ప్రతినిధి మాతంగి సురేష్):డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో కోదాడ కెఆర్ఆర్ కళాశాల మైదానంలో ఖేలో ఇండియా కబడ్డీ అకాడమీ కోదాడ ఆధ్వర్యంలో సమ్మర్ కోచింగ్ క్యాంప్ ప్రారంభం క్రీడాకారులు క్రీడా నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు సమ్మర్ క్యాంపులు దోహదపడతాయని కోదాడ కెఆర్ఆర్ డిగ్రీ కళాశాల విశ్రాంత పీడీ వేనేపల్లి శ్రీనివాసరావు,వైస్ ప్రిన్సిపాల్ చందా అప్పారావులు అన్నారు.గురువారం కోదాడ కెఆర్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ పర్యవేక్షణలో ఖేలో ఇండియా కబడ్డీ అకాడమీ కోదాడ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ ను ప్రారంభించి మాట్లాడారు.క్రీడాకారులు సమ్మర్ కోచింగ్ క్యాంప్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.కోచ్ జాతీయ క్రీడాకారుడు నామ నరసింహారావు మాట్లాడుతూ కోదాడలో సమ్మర్ కబడ్డీ క్యాంప్ ఏర్పాటుకు అనుమతులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ సహకరించిన జిల్లా యువ జన క్రీడల అధికారి రామచంద్రరావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు కొండలు,మాతంగి సైదులు,క్రీడాకారులు నవీన్ వినయ్,గోపి శ్రీకాంత్,రమేష్,సీతారాం,కాజా పాల్గొన్నారు.