Monday, July 7, 2025
[t4b-ticker]

క్రీడా స్ఫూర్తి ని ప్రపంచానికి చాటి చెప్పిన అభినవ్….

క్రీడా స్ఫూర్తి ని ప్రపంచానికి చాటి చెప్పిన అభినవ్….

:అభినవ్ ను ఆదర్శంగా తీసుకోవాలి……..

:ఘనంగా ఆసియా చెస్ ఛాంపియన్ మేకల అభినవ్ 23వ వర్ధంతి…….

Mbmtelugunews//కోదాడ,సెప్టెంబర్ 23(ప్రతినిధి మాతంగి సురేష్):క్రీడా స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప క్రీడాకారుడు మేకల అభినవ్ అని పలువురు రాజకీయ నాయకులు, పట్టణ ప్రముఖులు పేర్కొన్నారు. సోమవారం మేకల అభినవ్ 23 వ వర్ధంతి సందర్భంగా దొంగరి శ్రీను ఆధ్వర్యంలో పట్టణంలోని బాలుర హైస్కూల్ ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి అభినవ్ తల్లిదండ్రులు మేకల. వెంకటేశ్వర్లు, అరుణాలతో కలిసి  పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.  అభినవ్ స్పూర్తితో  కోదాడ నుండి భావి క్రీడాకారులు  చెస్ లో రాణించాలన్నారు. కోదాడ ఖ్యాతిని ఖండాంత రాలకు వ్యాపింప జేసిన అభినవ్ పేరు  చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. నేటి యువత అభినవ్ ను ఆదర్శంగా తీసుకొని క్రీడల్లో రాణించాలన్నారు. అనంతరం బాలుర హైస్కూల్లో పదవ తరగతిలో టాపర్ గా నిలిచిన విద్యార్థినికి నగదు ప్రోత్సాహాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో అభినవ్ తల్లిదండ్రులు మేకల వెంకటేశ్వర్లు అరుణ పిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి,మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు,ఎంఈఓ సలీం షరీఫ్,వంగవీటి రామారావు,బొలిశెట్టి కృష్ణయ్య, ముత్తినేని సైదేశరరావు,పైడిమర్రి సత్తిబాబు,షేక్ నయీమ్,ఈదుల కృష్ణయ్య,చందర్ రావు,దొంగరి శ్రీనివాస్,బాదే రాము,అంకతి అప్పయ్య,గంధం పాండు,కొమరగిరి రంగారావు, మదీనా మీరా,బొలిశెట్టి వెంకటేశ్వర్లు,బడుగుల సైదులు,సుందర్ బాబు,శమీ,సంజీవ్,క్రీడాకారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular