క్రైమ్ లను నిరోధించటానికి సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగకరం: సర్పంచి పాలకి సురేష్
Mbmtelugunews//కోదాడ, ఏప్రిల్ 12(ప్రతినిధి మాతంగి సురేష్): గ్రామంలో క్రైమును నిరోధించడానికి నిఘా నేత్రాలు ఎంతో ఉపయోగపడతాయని గ్రామ సర్పంచి పాలకి సురేష్ అన్నారు. మండల పరిధిలోని దోరకుంట గ్రామంలో ఆదివారం నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును గ్రామపంచాయతీలో ఏర్పాటుచేసిన మానిటర్ లో పరిశీలిస్తున్న రూరల్ ఎస్సై గోపాల్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ సహకారంతో దోరకుంట సర్పంచ్ పాలకి సురేష్, గ్రామ ప్రజల సహకారంతో గ్రామంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగినదని తెలిపారు. త్వరలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ హుజూర్ నగర్ గ్రామాల పరిధిలోగల సిసి కెమెరాలు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు పత్తిపాక వెంకటేశ్వర్లు, వార్డు మెంబర్ వనపర్తి పిచ్చయ్య, శీలం కోటేశ్వరరావు, పత్తిపాక రమేష్, నోముల బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.



