క్వారీల్లో నిర్లక్ష్యపు కోరలు
Mbmtelugunews//హుజూర్ నగర్,అక్టోబర్ 20 (ప్రతినిధి మాతంగి సురేష్)సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం వదినెపల్లి గ్రామ శివారులో 20 సర్వే నెంబర్లు ఆర్కే మినరల్స్ పాలిష్ బండల క్వారీకి ప్రభుత్వం సుమారు పది ఎకరాలు లీజుకు ఇచ్చింది.ఈ క్వారీకి ఎటువంటి భద్రత లేకుండా ఈ క్వారీ నిర్వాహకులు ఇందులో పని సాగిస్తున్నారు.ఈ క్వారీ రోడ్డు పక్కనే ఉండటం చేత క్వారీలోకి గేదెలు,మేకలు,గొర్రెలు,ఏదైనా అదుపుతప్పి వాహనము ఆ క్వారీలో పడిపోతే,ఆ క్వారీ లీజ్ కు ఇచ్చిన ప్రభుత్వనిదా,లేక క్వారీ యజమాని మట్టపల్లి లక్ష్మీనారాయణ దా చుట్టూ కనీసం ఫెన్సింగ్ కూడా లేని పరిస్థితిలో ఈ క్వారీ నిర్వహించబడుతున్నది.మైనింగ్ డిపార్ట్మెంట్ వారు దీన్ని చూసి చూడనట్టు వదిలేస్తున్నారా లేక చూసిన గాని పట్టించుకోవటం లేదా అని పలువురు వాపోతున్నారు.స్థానిక ప్రజల క్వారీ దగ్గర నుంచి వెళ్లాలంటేనే భయభ్రాంతులకు గురవుతున్నారు అని చెబుతున్నారు.క్వారీ యజమాని క్వారీ భద్రత నిబంధనలు మైనింగ్ నిబంధన ప్రకారం క్వారీ చుట్టుపక్కలకు మనుషులు,పశువులు రాకుండా ఫెన్సింగ్ వెయ్యాలి,క్వారీ గుంతల దగ్గర మనుషులు వెళ్లకుండా హెచ్చరిక సూచిక బోర్డులు పెట్టాలి,నిత్యం ప్రజలు అటువైపు రాకుండా సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేయాలి.

విద్యుత్ ట్రాన్స్ఫారం వద్ద విద్యుత్ తీగలు చిందరవందరగా పడిన పట్టించుకునే నాధుడు లేకుండా పోయారు.ఈ క్వారీ ఇంకా ఎన్ని సంవత్సరాలు పరిమిషన్ ఉన్నదో కూడాతెలియని పరిస్థితిలో ఆ గ్రామ ప్రజలు ఉన్నారు.అలాంటిది గణేష్ పాలిష్ బండల క్వారీ వారు ఎటువంటి భద్రత నిబంధనలను పాటించటం లేదు.అయినా మైనింగ్ వారు నిమ్మకు నిరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు అని అక్కడ ఉన్న ప్రజలు వాపోతున్నారు.ఇప్పటికైనా మైనింగ్ వారు మొద్దు నిద్ర వదిలి ఈ క్వారీని పరిశీలించి తగు భద్రతా చర్యలను చేపట్టాలని వదినెపల్లి గ్రామం ప్రజలు కోరుకుంటున్నారు.