ఖబర్దార్ మహేశ్వర్ రెడ్డి
:ఉత్తమ్ కుమార్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలి
:మహేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే వై ఉండి పిచ్చోళ్ళ మాట్లాడటం సబబు కాదు మహేశ్వర్ రెడ్డి:వికలాంగుల విభాగ రాష్ట్ర నాయకులు షేక్ రఫీ
కోదాడ,మే 23(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పై బిజెపి ఎమ్మెల్యే, శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి చేసిన ఆరోపణలను తక్షణమే వెనక్కి తీసుకోవాలి లేకుంటే వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో బిజెపికి తగిన బుద్ధి చెబుతామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వికలాంగుల విభాగ రాష్ట్ర నాయకులు షేక్ రఫీ అన్నారు.ఉత్తమ్ కుమార్ రెడ్డి పై రాజకీయ లబ్ధి కోసం, రాష్ట్రంలో సోషల్ మీడియాలో హైలెట్ కావాలని బిజెపి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఉత్తమ్ పై ఆరోపణలు చేస్తున్నారన్నారు.ఉత్తమ్ ఆరుసార్లు ఎమ్మెల్యేగా,ఒకసారి ఎంపీగా,రెండుసార్లు మంత్రిగా,టిపిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన ఉత్తమ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయటం మహేశ్వరి రెడ్డి మీకు సబబు కాదు అని అన్నారు. నువ్వు ఎక్కడో ఉండి మాట్లాడటం సబబు కాదు కోదాడ,హుజూర్ నగర్ నియోజకవర్గాలకు వచ్చి అభివృద్ధిని చూసి అప్పుడు మాట్లాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రాబోయే రోజులలో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దొంతగాని అంజయ్య గౌడ్,చింతకుంట్ల సూర్యం పాల్గొన్నారు



