ఖమ్మం క్రాస్ రోడ్ సెంటర్ ను భగత్ సింగ్ సెంటర్ గానే కొనసాగించాలి
కోదాడ,జులై 06(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కోదాడ పట్టణంలో ఖమ్మం క్రాస్ రోడ్లు ను భగత్ సింగ్ సెంటర్ గానే కొనసాగించాలని సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు,పట్టణ కార్యదర్శి ఎం ముత్యాలు లు పాల్గొని భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన తెలిపారు.అనంతరం వారు మాట్లాడుతూ గత గురువారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ పర్యటనలో భాగంగా కోదాడకు వచ్చినప్పుడు కోదాడ టిడిపి నాయకుల ఆధ్వర్యంలో ఖమ్మం క్రాస్ రోడ్డుకు ఎన్టీఆర్ పేరు నామకరణం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చినారు.గతంలో ఆ సెంటర్ కు భగత్ సింగ్ సెంటర్ అనే పేరు ఉన్నదని మరల మార్చి ఎన్టీఆర్ సెంటర్ గా ఎలా పెడతారని అన్నారు.మంత్రి ఇట్టి విషయంలో చొరవ తీసుకొని ఖమ్మం క్రాస్ రోడ్ సెంటర్ ను భగత్ సింగ్ సెంటర్ గానే కొనసాగించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు దాసరి శ్రీనివాస్,జి మరియన్న,సిహెచ్ భీమయ్య,నక్క గోపి,గంట నాగరాజు,ప్రజా సంఘాల నాయకులు షేక్ జానీ,షేక్ కాజా,శరభంద రెడ్డి,తిరపయ్య,వెంకన్న,ఉపేందర్,సైదులు,రాంబాబు,రాములు తదితరులు పాల్గొన్నారు.